ప్రదీప్ సినిమా పరిస్థితి ఏమిటి?

ప్రస్తుతం కరోనా కటకట మాములుగా లేదు. అందుకే థియేటర్స్ ఓపెన్ అయినా ప్రేక్షకులు రారని ధీమాతో చాలా సినిమాలను ఓటిటికి అమ్మేసి వదిలించుకుంటున్నారు దర్శకనిర్మాతలు. వడ్డీలు కట్టలేక [more]

Update: 2020-10-01 04:54 GMT

ప్రస్తుతం కరోనా కటకట మాములుగా లేదు. అందుకే థియేటర్స్ ఓపెన్ అయినా ప్రేక్షకులు రారని ధీమాతో చాలా సినిమాలను ఓటిటికి అమ్మేసి వదిలించుకుంటున్నారు దర్శకనిర్మాతలు. వడ్డీలు కట్టలేక సినిమాలను ఓటిటీలకు అమ్మెస్తున్నాం అంటున్నారు నిర్మాతలు. అయితే నాని వి, అనుష్క నిశ్శబ్దం, రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా, సుహాస్ కలర్ ఫోటోలు ఓటిటీలు బాట పట్టిన యాంకర్ ప్రదీప్ హీరోగా మొట్టమొదటిసారి నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా మాత్రం ఇంకా ఓటిటి నా లేదంటే థియేటర్స్ లోనే విడుద లా అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. కరోనా లేకపోతె మార్చ్ లోనే ఈ సినిమా విడుదలయ్యేది. కానీ కరోనా వలన ప్రదీప్ హీరోగా పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.

అయితే ఎంతమంది ఓటిటి బాట పట్టినా యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడమేలా సినిమా నిర్మాతలకు మాత్రం ఆ సినిమాని ఓటిటికి అమ్మే ఉద్దేశ్యం లేనట్లుగా కనబడుతుంది. మరి ఆ సినిమాలోని నీలి నీలి ఆకాశం నిజంగానే ఆకాశం తాకే క్రేజ్ తో దూసుకుపోతుంది. కానీ సినిమానే ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు విడుదలవుతుంది చెప్పడం లేదు. మరి ప్రదీప్ మన సినిమా ఓటిటిలో వద్దు థియేటర్స్ లోనే అని పట్టుబడుతున్నాడేమో… అందుకే దర్శకనిర్మాతలు ఆగారు. లేదంటే పెద్ద సినిమా నిర్మాతలే తలొగ్గిన ఓటిటికి 30 రోజుల్లో ప్రేమించడమేల నిర్మాత తలొగ్గడా?.. ఏదైనా ఈ సినిమా ప్రస్తుతం న్యూస్ లో అయితే కనిపించడం లేదు. మళ్ళీ నీలి నీలి ఆకాశం ఏమైనా రికార్డు కొడితే కానీ ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కిన సినిమా సోషల్ మీడియాలో హంగామా చెయ్యదు. లేదంటే ప్రేక్షకులు ఆ సినిమాని మరిచిపోయినా మరిచిపోతారు

Tags:    

Similar News