ఏపీ వరదలపై టాలీవుడ్ స్పందించదా?
ఆంధ్రప్రదేశ్ ను వరదలు ముంచెత్తాయి. ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్ ను వరదలు ముంచెత్తాయి. ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను ప్రారంభించింది. వేల కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. లక్షలాది ఎకరాలు నీటమునిగాయి. పంటనష్టం వేల కోట్లలో ఉంది. పక్కా ఇల్లు కూడా ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సహాయం కోసం కోరింది. ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
ఏపీ నుంచే టాలివుడ్ కు...
కానీ ఏపీలో తెలుగు సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు సినిమాలకు వచ్చే ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువగా వస్తుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి స్పందన కరువైందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అయితే తాజాగా అల్లు అరవింద్ కుటుంబానికి చెందిన గీతా ఆర్ట్స్ వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. వరద బాధితులకు పది లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయనిధికి పది లక్షలు పంపుతున్నట్లు ప్రకటించింది. ఏపీని నమ్ముకుని వెండితెరను ఏలుతున్న హీరోలు, నిర్మాతలు ఏపీ వరద బాధితుల సాయానికి ముందుకు వస్తారా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. టాలివుడ్ కు, ముఖ్యమంత్రి జగన్ కు మధ్య సంబంధాలు అంతంత మాత్రమే ఉండటంతో ఈ ఊహాగానాలు చెలరేగుతున్నాయి.