యానిమల్ సినిమా, కలెక్షన్స్ పై దారుణ విమర్శలు

యానిమల్ సినిమా కలెక్షన్స్ దుమ్ముదులుపుతున్నాయి. 13 రోజుల్లో ఈ సినిమా 772.33

Update: 2023-12-14 09:25 GMT

 animalmoviecollections

యానిమల్ సినిమా కలెక్షన్స్ దుమ్ముదులుపుతున్నాయి. 13 రోజుల్లో ఈ సినిమా 772.33 కోట్లు కలెక్ట్ చేసింది. A రేటెడ్ సినిమా.. మూడున్నర గంటల నిడివి ఉన్నా కూడా… కూడా ఈ సినిమా కలెక్షన్స్‌ భారీగా ఉన్నాయి. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఇప్పటికీ జోరుగా వసూళ్లను దక్కించుకుంటోంది. ఇండియాలోనే యానిమల్ సినిమా 9 రోజుల్లో రూ.395.27 కోట్ల నెట్‍ కలెక్షన్లను దక్కించుకుంది. అన్ని భాషల వెర్షన్‍లను కలిపి దేశంలో ఈ వసూళ్లను రాబట్టింది. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్ (2016) సినిమాను ఇండియా వసూళ్ల విషయంలో దాటేసింది యానిమల్. దంగల్ చిత్రం ఇండియాలో రూ.387.38 కోట్ల నెట్ కలెక్షన్లను దక్కించుకుంది. ఇప్పుడు దంగల్ ఇండియా లైఫ్ టైమ్ కలెక్షన్లను యానిమల్ 9 రోజుల్లోనే దాటేసింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రంలో రణ్‍బీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి కీలకపాత్రలు చేశారు.

ఈ సినిమాపై ప్రముఖ డీఓపీ విమర్శలు గుప్పించారు. ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా కోసం పనిచేస్తున్న DOP సిద్ధార్థ నుని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రణబీర్ కపూర్ యానిమల్ చిత్రం గురించి సమీక్షను పోస్ట్ చేశాడు. యానిమల్ సినిమా బాక్సాఫీస్ సంఖ్యలు భారతదేశంలో ప్రజల సామాజిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయని సిద్ధార్థ నుని చెప్పారు. యానిమల్‌ని చూసిన తర్వాత తాను ట్రిగ్గర్ అయ్యానని సిద్ధార్థ్ పేర్కొన్నాడు. విషపూరితమైన పురుషాధిక్యతను, మితిమీరిన హింసను, నాజీలను కీర్తించడం (హీరో ఛాతీపై స్వస్తిక్ ధరించడం) సినిమా తనకు నచ్చలేదని చెప్పాడు. రణబీర్ కపూర్ ప్రేక్షకులకు అభ్యంతరకరమైన సంజ్ఞలు చేసే చివరి సన్నివేశానికి తాను పూర్తిగా వ్యతిరేకమని కూడా పేర్కొన్నాడు. యానిమల్ బాక్సాఫీస్ సంఖ్యలు భారతదేశంలోని సామాజిక స్థితి ఎంత దిగజారిపోయాయో తెలుస్తోందని సిద్ధార్థ నుని అన్నారు.


Tags:    

Similar News