భారత ఎన్నికల సంఘం ఉపయోగించే ‘నోటా’ అనే పదాన్ని సినిమా టైటిల్ గా వాడడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓయూ విద్యార్థి ఐకాస నేత కైలాస్ నేత ఈ పిల్ ను దాఖలు చేశారు. ‘నోటా’ అనే పదాన్ని వాడేందుకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి అని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ చిత్రాన్ని ఎన్నికల సంఘం వీక్షించి అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే తొలగించిన తరువాతే చిత్రం విడుదలకు అవకాశం ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఇది ఫక్తు రాజకీయ సినిమా కాబట్టి ఓటర్లను ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని, కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించాకే నోటా విడుదలకు అవకాశం ఇవ్వాలని హైకోర్టును పిటీషనర్ కోరారు. ఈ పిటీషన్ రేపు కోర్టు విచారణకు రానుంది.