తెలుగులో కథానాయికల నుండి డైరెక్టర్స్ గా మారిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో విజయనిర్మల, సావిత్రి, శ్రీప్రియ, భానుమతి, జీవితా రాజశేఖర్ ప్రథమ స్థానంలో ఉన్నారు. వీరు మొదట తమ కెరీర్ ని హీరోయిన్స్ గా స్టార్ట్ చేసి తరువాత నెమ్మదిగా డైరెక్టర్స్ గా మారారు. హిట్స్, ప్లాప్స్ పక్కన పెడితే మన తెలుగులో దర్శకులుగా మారిన కథానాయికల సంఖ్య మరీ తక్కువ. ఇప్పుడున్న హీరోయిన్స్ లో కొంతమందికి ఆ కోరిక ఉంది. 'అలా మొదలైంది' సినిమాతో తన టాలెంట్ ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసిన నిత్య మీనన్ కు దర్శకత్వం చేయాలనే తన కోరిక అని ఆ మధ్య ఒకసారి చెప్పింది. దానికి తగ్గట్టు ప్రిపరేషన్స్ లో కూడా ఉన్నాను అని చెప్పింది. అయితే ఇంతవరకు తను డైరెక్షన్ చేసే సినిమాల గురించి ఎక్కడా చెప్పలేదు.
త్రివిక్రమ్ మాత్రమే స్పందించి...
ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో హీరోయిన్ చేరింది. ‘అ ఆ’, ‘ప్రేమమ్’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రాల్లో నటించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు దర్శకత్వం అంటే ఆసక్తి అని చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ.." నాకు కెమెరా ముందు కన్న కెమెరా వెనక ఉండటమే ఇష్టమని... డైరెక్టర్ గా కావాలనే కోరిక ఉందని.. అది తన కల అని.. తన మనసులో మాట బయటపెట్టింది. మణిరత్నం ఏ ఫ్రేమ్ పెట్టినా బాగుంటుందని... నాకు ఆయనలా అందమైన విజువల్స్ తీయాలనేది నా కల అని చెప్పింది. తన దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయని అవి స్క్రిప్ట్స్ గా మార్చాలని అంటుంది. నేను పని చేసిన దర్శకుల్లో కొంతమందిని.. మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వమని అడిగా. అందులో త్రివిక్రమ్ రెస్పాండ్ అయి ఓకే అన్నారు అంది. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన తరువాతే డైరెక్టర్ అవుతా. కానీ ఎప్పుడు అవుతానో మాత్రం చెప్పలేను అని చెప్పింది". సో ఈ మలయాళ బ్యూటీ త్వరలో డైరెక్టర్ గా మారబోతుందన్నమాట....