మరో వారంలో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అరవింద సమేత' రిలీజ్ అవ్వబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఈ సినిమాపై మరింత అంచనాలు ఏర్పడ్డాయి. కథ అంత కొత్తగా ఏమీ లేకపోయినా కథనం మాత్రం ఆసక్తికరంగా సాగుతుందని.. ఎన్టీఆర్ ఇందులో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్స్..లవ్ సీన్స్.. రెండు మూడు సాంగ్స్..త్రివిక్రమ్ పంచులతో కూల్ గా వెళ్ళిపోతుంది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం ఫ్యాన్స్ కి పండగే అని అర్ధం అవుతుంది. ఫస్ట్ హాఫ్ చివరి ఇంటర్వెల్ సీన్స్ అయితే అభిమానులకి పూనకాలే అని తెలుస్తుంది.
క్లైమాక్స్ లో ఫైట్ ఉండదా..?
సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుండి చాలా సీరియస్ గా సాగుతుందని సమాచారం. కానీ క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుందని..హీరోలో మార్పు వచ్చి ఫ్యాక్షనిజానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో శాంతియుతంగా పోరాడతాడని ట్రైలర్ సంకేతాలిచ్చింది. ఇందుకు తగ్గట్లే ముగింపులో భారీ ఫైట్లు లాంటివేమీ ఉండదట. కానీ ఇంటర్వెల్ ఫైట్ మాత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే హైలైట్ అని చెబుతున్నారు. తారక్ షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ చూపించే సీన్ కూడా అప్పుడే వస్తుంది. మరి ఇన్ని అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ మేరకు జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఒక రేంజ్ లో జరిగింది. రాయలసీమ నేపథ్యంలో సాగే కథ కాబట్టి సీడెడ్ కలెక్షన్స్ అదిరిపోతాయి అని ట్రేడ్ చెబుతుంది.