ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ చిత్రంగా రూపొందిన 'అరవింద సమేత' భారీ అంచనాలు మధ్య ఈరోజు రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్ లో అరవింద సమేత రిలీజ్ అవుతుంది. బిజినెస్ పరంగా వీర రాఘవుడి ముందు పెద్ద టార్గెట్ ఉంది. ఈసినిమా థియేట్రికల్ రైట్స్ మొత్తంగా 91 కోట్ల దాకా అమ్ముడైంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 67 కోట్ల వ్యాపారం చేసిన ఈసినిమాకు ఇంత మొత్తంలో షేర్ దాటితేనే ఇది హిట్ కిందకు వస్తుంది.
95 కోట్లు షేర్ ను వసూల్ చేస్తే రంగస్థలం..భరత్ అనే నేను సినిమా ఫుల్ రన్ షేర్ ను దాటే అవకాశముంది. అయితే రంగస్థలం ఫుల్ రన్ షేర్ 120 కోట్లు దాకా వచ్చింది. ప్రస్తుతం అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన రంగస్థలం సినిమా రికార్డు ని బ్రేక్ చేయొచ్చు. బాహుబలి రికార్డ్స్ తప్ప. ఇక మహేష్ భరత్ అనే నేను 95 కోట్ల దాకా వచ్చింది. ఈసినిమా ని బీట్ చేయాలంటే కచ్చితంగా అరవింద సమేత హిట్ అయ్యే తీరాలి. ఆలా జరిగితే టాప్ 5 లోకి చేరిపోతాడు రాఘవుడు.
లెక్కలైతే బాగానే వేశారు కానీ..సినిమా టాక్ పైనే కలెక్షన్స్ అండ్ రికార్డ్స్ ఆదారపడి ఉన్నాయి. అయితే హిట్.. ప్లాప్ తో సంబంధం లేకుండా మొదటి నాలుగు రోజులు 35 నుంచి 40 కోట్ల దాకా షేర్ వచ్చే అవకాశముంది. ఇక ఎలాగో దసరా సెలవులు కాబట్టి మరో 10 కోట్లు వేసుకున్న దగ్గరదగ్గర 60 కోట్లు షేర్ ను వసూల్ చేయొచ్చు. ఈ లెక్కలంతా సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంటే. ఒకవేళ ఎబోవ్ యావరేజ్ కానీ హిట్ కానీ టాక్ వస్తే రికార్డ్స్ ను కొల్లగొట్టడం కాయం అని ట్రేడ్ చెబుతున్నారు. ఏది ఏమైనా ఈరోజు ఈసినిమా పరిస్థితి తెలియనుంది.