మరో మూడు రోజుల్లో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'అరవింద సమేత' రిలీజ్ అవ్వబోతుంది. అంటే ఈనెల 11న ఇది థియేటర్స్ లోకి రానుంది. అయితే ఈ సినిమా వచ్చే సరికి థియేటర్స్ లో ఏ క్రేజీ చిత్రం ఉంటుందేమో? దానివల్ల అరవిందకు థియేటర్స్ కొంచం కష్టం అవుతుందేమో? కలెక్షన్స్ పై దెబ్బ పడుతుందేమో? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెంగ పడ్డారు. అనుకున్నట్టుగానే అక్టోబర్ 5న విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమా వల్ల డ్యామేజ్ జరుగుతుందేమోనని ఎక్కువ ఆందోళన చెందారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎందుకంటే విజయ్ కు యూత్ లో యమ క్రేజ్ వుంది. అయితే అందరు అనుకున్నట్టు ఇది పాజిటివ్ టాక్ దక్కించుకోలేకపోయింది. విడుదలైన రోజు నుండి డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో సెకండ్ డే కే థియేటర్లు ఖాళీ అయిపోయాయి. 'అరవింద సమేత' వచ్చే సరికి 'నోటా' చాలా థియేటర్స్ నుండి కనుమరుగు అవుతుంది.
అన్నీ కలిసివస్తున్నాయే...
ఇక 'దేవదాస్' పరిస్థితి కూడా అంతే. చాలా చోట్ల ఈ సినిమా ఫుల్ రన్ ముగిసినట్టే అని చెప్పాలి. సో ఈ సినిమా కూడా చాలా థియేటర్స్ నుండి ఎత్తివేయాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పుడు 'అరవింద సమేత'కు లైన్ క్లియర్ అయింది. దసరా సీజన్ లో వస్తుంది కాబట్టి కలెక్షన్స్ కు ఏమీ ఢోకా లేనట్టు కనిపిస్తుంది. దసరా సెలవలు అక్టోబర్ 9 నుంచి ఇవ్వనున్నారు. స్కూల్స్ కి కూడా సెలవులు అదే రోజు నుండి ఇస్తుండడంతో రిపీటెడ్ ఆడియన్స్ ఉండే అవకాశం ఉంది. ఏ మాత్రం మంచి టాక్ వచ్చినా ఈ చిత్రానికి వారం రోజుల పాటు ఎదురే ఉండదు. కాబట్టి ఈ సినిమాకి అన్ని విధాలా అనుకూల వాతావరణం కనిపిస్తుంది.