ఈనెల 11న దసరా కానుకగా రిలీజ్ అయినా త్రివిక్రమ్ - ఎన్టీఆర్ ల 'అరవింద సమేత' ఓ అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమా టికెట్స్ బుకింగ్ వెబ్ సైట్ 'బుక్ మై షో డాట్ కామ్'లో 12 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. అంతకముందుకు 'బాహుబలి' పార్ట్ 1 పై ఉన్న ఈ రికార్డ్ ను అరవింద బ్రేక్ చేసింది. 'బాహుబలి 2' తర్వాత స్థానంలో అత్యధికంగా అమ్ముడైంది ఈ సినిమా టికెట్లే. ఈవిషయాన్ని సదరు వెబ్ సైట్ వెల్లడించింది. తెలుగులో మంచి మంచి చిత్రాలు వస్తున్నాయి అనడానికి ఇదే నిదర్శనమని అని 'బుక్ మై షో' ప్రతినిధి ఒకరు తెలిపారు.
115 కోట్లు వసూలు చేసి.....
త్రివిక్రమ్ మాటలతో..ఎన్టీఆర్ డైలాగ్స్ తో 'అరవింద సమేత' రూ.115 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 55 కోట్లు షేర్ ను రాబట్టింది. నైజాం హక్కులను దిల్ రాజు రూ.18 కోట్లకు కొనగా, ఆయన డబ్బులు ఆయనకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 74 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ చెబుతున్నారు. విదేశాల్లో ఈసినిమాను 12 కోట్లకు విక్రయించగా.. మంగళవారం నాటికే రూ. 11.30 కోట్లు రాబట్టినట్టు సమాచారం.
రికార్డ్ తుడిచేస్తుందా...?
ఇక కృష్ణా..గుంటూరు..సీడెడ్..ఈస్ట్..వెస్ట్ డిస్ట్రిబ్యూటర్లు ఈ వారం నుండే లాభాలు వచ్చే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే నాన్ 'బాహుబలి' పేరు మీద ఉన్న అన్ని రికార్డ్స్ తుడిచేయడం పెద్ద విషయయేమి కాదు అని అంటున్నారు ట్రేడ్. మరో రెండు మూడు రోజుల్లో ఈసినిమా సక్సెస్ మీట్ జరగనుంది.