కర్ణుడిగా బాలకృష్ణ .. అర్జునుడిగా కల్యాణ్ రామ్

Update: 2018-11-13 06:57 GMT

ఇప్పుడున్న డైరెక్టర్లలో వారు తీసిన సినిమాల కలెక్షన్స్ పక్కన పెడితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నవారిలో రాజమౌళి, కొరటాల, క్రిష్ కచ్చితంగా ఉంటారు. సినిమా కథనే నమ్ముకుని ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా సినిమాలు తీసయ్యడంలో క్రిష్ ఎక్స్పర్ట్. అటువంటి క్రిష్ ఇప్పుడు ‘నందమూరి తారకరామారావు’ జీవిత కథను తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుత షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో శరవేగంగా జరుపుకుంటుంది.

నందమూరి అభిమానులకు పండుగే...

అక్కడ 'దాన వీర శూర కర్ణ' చిత్రానికి సంబంధించిన సీన్స్ ను చిత్ర బృందం చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ రోజు కానీ రేపు కానీ ఈ సినిమాలోని ‘చిత్రం భళారే విచిత్రం’ పాటకు సంబంధించిన సీన్స్ ని షూట్ చేయనున్నారు. ఇందులో అర్జునుడు పాత్ర కోసం కళ్యాణ్ రామ్ ని తీసుకున్నారట. కళ్యాణ్ రామ్ పై మరో రెండు రోజుల్లో సీన్స్ ను షూట్ చేయనున్నారు. కళ్యాణ్ రామ్ అటు హరికృష్ణ పాత్రలో, అర్జునుడు పాత్రలోనూ కనిపించున్నాడు. ఇది నందమూరి ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త.

Similar News