బాలకృష్ణ లాస్ట్ మూవీ అదే అంట

Update: 2018-11-24 04:52 GMT

నందమూరి బాలకృష్ణ ఎంతో గ్రాండ్ లెవెల్ గా తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈసినిమాను “ఎన్ బీ కే ఫిలిమ్స్” బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు బాలయ్య. ఈసినిమా తరువాత బాలకృష్ణ మరో సినిమాని కూడా లైన్ లో పెట్టాడు. నెక్స్ట్ సినిమా వీవీ వినాయక్ తో చేయనున్నాడు. ఇది రీమేక్ చిత్రం అంటున్నారు కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం స్ట్రెయిట్ సినిమానే అని తెలుస్తుంది.

ఈసినిమాను సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రిలీజ్ అయిన వెంటనే వీవీ వినాయక్ తో చేయనున్నాడు బాలయ్య. ఈసినిమా తరువాత బాలయ్య బయట బ్యానర్ లో సినిమాలు చేయటం మానేసి తన సొంత బ్యానర్ అయిన “ఎన్ బీ కే ఫిలిమ్స్” బ్యానర్ లోనే నటించాలని డిసైడ్ అయ్యాడట.

త్వరలోనే తన కొడుకు మోక్షజ్ఞ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం చేయనున్నాడు. సో తన కొడుకు ఎంట్రీ ఇచ్చే లోపే తన బ్యానర్ ని బలంగా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడట. బయట బ్యానర్ లో వీవీ వినాయక్ తో చేసే సినిమాతోనే లాస్ట్ అని అంటున్నారు తన సన్నిహితులు. అయితే సి. కళ్యాణ్ తో - బాలయ్య ఇద్దరు ఈసినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

Similar News