బన్నీ ఇక తియ్యవా?

ఇప్పుడు హీరోలు చాలామంది లాక్ డౌన్ స్పెషల్ అంటూ గెడ్డం పెంచి మీసాలు పెంచుతుంటే…. అల్లు అర్జున్ మాత్రం పుష్ప కోసం పెంచిన గెడ్డాన్ని మైంటైన్ చేస్తూ [more]

Update: 2020-07-13 07:02 GMT

ఇప్పుడు హీరోలు చాలామంది లాక్ డౌన్ స్పెషల్ అంటూ గెడ్డం పెంచి మీసాలు పెంచుతుంటే…. అల్లు అర్జున్ మాత్రం పుష్ప కోసం పెంచిన గెడ్డాన్ని మైంటైన్ చేస్తూ తిప్పలు పడుతున్నాడు. అందరూ ఇంట్లోనే వర్కౌట్స్, జిమ్ చేస్తుంటే.. అల్లు అర్జున్ మాత్రం రెగ్యులర్ గా కేబీఆర్ పార్క్ కి వాకింగ్ రావడం, వీలవదు అనుకున్నప్పుడు ఏ అవుట్ స్కర్ట్స్ కో వెళ్లి వాకింగ్ చేస్తుంటాడు. అయితే కరోనా రాకముందు అల్లు అర్జున్ పుష్ప కోసం ఫుల్ గా రఫ్ గా మేకోవర్ అయ్యాడు. గెడ్డం, మీసం, జుట్టు అంతా మాస్ టైప్ లో పెంచి పోకిరివాడిలా తయారయ్యాడు.

అయితే లాక్ డౌన్ ముగిసి సెట్స్ మీదకెళదామనుకుంటే… కరోనా ఇంకా ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. సుకుమార్ పుష్ప కోసం ఓ ప్లాన్ చేసి హైదరాబాద్ చివరిలో లేదా కరీంనగర్ దగ్గర అడవుల్లో పుష్ప షూటింగ్ ప్లాన్ చేసి కరోనా విషయంలోనూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు.  కానీ అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడున్న సమస్య. అయితే అల్లు అర్జున్ మాత్రం పుష్ప లుక్ లోనే కంటిన్యూ అవుతున్నాడు.అందరూ లాక్ డౌన్ లో మీసం, గెడ్డలు పెంచి తిరుగుతుంటే.. అల్లు అర్జున్ మాత్రం పుష్ప మేకోవర్ లోనే కష్టపడుతున్నాడు. ఇక బన్నీ అభిమానులు ఇప్పుడప్పుడే పుష్ప షూటింగ్ అయ్యేలా లేదు.. ఇంకా ఆ లుక్ నే ఏంటి బ్రదర్ అంటున్నారు.

Tags:    

Similar News