హిట్స్, ఫ్లాప్స్ పక్కన పెడితే ఇప్పుడున్న యంగ్ హీరోస్ తో పోటీగా నిలబడుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పుడున్న కాంపిటేషన్ లో పలు జాగ్రతలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఈ యంగ్ హీరో. లేటెస్ట్ గా ఈయన నటించిన 'సాక్ష్యం'ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి రెడీ అవుతున్నాడు.
బాగానే హోప్స్ పెట్టుకుని.....
రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాపై శ్రీనివాస్ బాగానే హోప్స్ పెట్టుకున్నాడు. ఇది ఇలా ఉండగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ యువ హీరో. శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడుతో తన తర్వాత సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. శ్రీనివాస్ కి జోడిగా టాలీవుడ్ క్వీన్ కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.
సగంకూడా పూర్తి కాక ముందే.....
ఈ కథ కొత్తదనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఉత్కంఠ భరితంగా సాగిపోతుందట. ఈ టాక్ బయట షికార్లు కొడుతుందనేమో ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులను ఓ పెద్ద సంస్థ 9.5 కోట్లను చెల్లించినట్టుగా సమాచారం. షూటింగ్ సగం కూడా కంప్లీట్ చేయకుండానే ఈ స్థాయిలో హిందీ శాటిలైట్ రైట్స్ పలకడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది.