హీరో మారాడా?

తమిళంలో సూపర్ హిట్ అయినా రాక్షసన్ సినిమా లో విష్ణు విశాల్ – అమల పాల్ హీరోహీరోయిన్స్ గా నటించారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈచిత్రం [more]

Update: 2019-01-04 03:11 GMT

తమిళంలో సూపర్ హిట్ అయినా రాక్షసన్ సినిమా లో విష్ణు విశాల్ – అమల పాల్ హీరోహీరోయిన్స్ గా నటించారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈచిత్రం అక్కడ తమిళంలో 20 కోట్ల మేరకు వసూలు చేసి సక్సెస్ అయినా సంగతి తెలిసిందే. అయితే ఎప్పటినుండో ఈసినిమా ను తెలుగు లో రీమేక్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

హీరో నితిన్ ఈసినిమాను తెలుగు లో రీమేక్ చేయనున్నాడని ప్రచారం జరిగింది. తెలుగులో నితిన్ హీరోగా నటించి నిర్మిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా ఈసినిమా చేతులు మారినట్లు తెలుస్తుంది. నితిన్ ప్లేస్ లో మరో యంగ్ హీరో వచ్చాడు. ఈ సినిమాను హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.


అయితే నిర్మాత ఎవరూ? డైరెక్టర్ ఎవరూ? అన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి బెల్లంకొండ శ్రీనివాస్ అయితే ఈ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బెల్లంకొండ ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో ఒకటి రమేష్ వర్మ డైరక్షన్ లో మరోటి చేస్తున్నాడు. అలానే ఆర్ ఎక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతి డైరక్షన్ లో ఓ సినిమా….. కొత్త డైరెక్టర్ తో కూడా ఒక మూవీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. సో టోటల్ గా మనోడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. మరి వీళ్లలో ఎవరి చేతిలో రాక్షసన్ బాధ్యతలు పెడతాడో చూడాలి. సినిమాలు సక్సెస్ అవ్వటం ఏమోకానీ మనోడికి వరసబెట్టి సినిమాలు మీద సినిమాలు వస్తున్నాయి. పెట్టి పుట్టాలి అంటారు కాదా అది ఇదేనేమో.

Tags:    

Similar News