మెగాస్టార్ సరసన విక్టరీ వెంకటేశ్... కాంబినేషన్ అదిరిపోయిందిగా?
మెగాస్టార చిరంజీవితో సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు.;

మెగాస్టార చిరంజీవితో సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. అయితే అనిల్ రావి పూడి కొత్తకొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మూవీని థియేటర్లలో పూనకాలు తెప్పిస్తారు. కలెక్షన్ల విషయంలోనూ అనిల్ రావిపూడి తో మూవీ నిర్మాత నిర్భయంగా నిద్రపోవచ్చు. అలాంటి అనిల్ రావిపూడి మూవీ ప్రారంభమయ్యే దగ్గర నుంచి పూర్తయ్యేంత వరకూ వరస అప్ డేట్స్ ఇస్తూ, విపరీతమైన బజ్ ను ఫ్యాన్స్ లో క్రియేట్ చేస్తారు. సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ ప్రేక్షకుల్లోనూ, హీరో ఫ్యాన్స్ లోనూ క్రేజ్ తగ్గకుండా జాగ్రత్త పడతారు.
కొత్తదనంతో...
అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ తీసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి కూడా అనిల్ తో సినిమాకు వెంటనే ఒప్పేసుకన్నారు. కథ, కథనం, కామెడీ, ఫైట్స్ ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లే డైరెక్టర్ ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపిస్తారు. సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేష్ బాబు తో పాటు విజయశాంతిని కూడా కనిపించేలా చేసి మూవీని ఒక రేంజ్ కు తీసుకుపోయారు. విజయశాంతి అప్పటి వరకూ మూవీలు మానేసి రాజకీయాలు పరిమితమయినా, ఆమెను ఒప్పించి మరీ సరిలేరు నీకెవ్వరును సక్సెస్ చేశారు.
ఎప్పటికప్పుడు హైప్ క్రియేట్ చేస్తూ...
ఇక ఎఫ్ 1, ఎఫ్ 2 మూవీలలో అయితే వెంకటేశ్ తో పాటు వరుణ్ తేజ్ తో మరో ప్రయోగం చేసి బాక్సాఫీస్ వద్ద మరో బ్రేక్ తీసుకున్నాడు. కామెడీతో అందరినీ ఆకట్టుకునే అనిల్ రావిపూడి చిరంజీవితో ఎలాంటి కథనంతో రాబోతున్నాడన్న ఆసక్తి ఇప్పటి నుంచే అందరిలోనూ మొదలయింది. ఎప్పటికప్పుడు అప్ డేట్ అందుతున్నా ఈ మూవీకి సంబంధించి ఏ వార్త వచ్చినా మెగా అభిమానులు చెవులు రిక్కించి వినేలా ముందు నుంచే ఒక హైప్ క్రియేట్ చేశారు. తాజాగా విక్టరీ వెంకటేశ్ మెగాస్టార్ తో కలసి ఈ మూవీలో నటిస్తున్నట్లు వార్తలు వస్తు్నాయి. చిరంజీవి 157 చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్ లో ఒక మోత మోగుతుంది. పూర్తిస్థాయి పాత్రలోనే వెంకటేశ్ కనిపిస్తారని, ఇక మెగా అభిమానులతో పాటు విక్టరీ వెంకటేశ్ ఫ్యాన్స్ కు కూడా ఇది సూపర్ న్యూస్ అని చెప్పాలి. వచ్చే సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుందని, జూన్ నుంచి షూటింగ్ ప్రారంభవుతుందన్నది టాలీవుడ్ వర్గాల టాక్.