'భరత్ అనే నేను'పై ఎస్పీకి ఫిర్యాదు!

Update: 2018-06-05 07:58 GMT

మహేష్ - కొరటాల కాంబినేషన్ లో వచ్చిన 'భరత్ అనే నేను' సినిమా ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను వసూల్ చేసింది. అయితే ఈ సినిమాపై నవోదయం పార్టీ అధ్యక్షుడు నల్లకరాజు గుంటూరు జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.

మా పార్టీకి వ్యతిరేకంగా చూపారు...

నవోదయం పార్టీని 2010 లో రిజిస్టేషన్ చేయించామని, తమ పార్టీ పట్ల సినిమాలో ద్వేషం కలిగించేలా చూపించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో అయన మాట్లాడుతూ... సినిమాలో తమ పార్టీ జెండాను, పార్టీ పేరును పలుమార్లు చూపిస్తూ, అప్రజాస్వామికమైన పదజాలాన్ని వాడారని మండిపడ్డారు. తమ పార్టీ లక్ష్యాలకు వ్యతిరేకమైన మాటలను చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ తరుపున ఈ చిత్రంపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని, తగిన చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు.

Similar News