గెట్ రెడీ అంటున్నాడు!

Update: 2018-05-30 04:13 GMT

గ‌త ఏడాది స్టార్ మా వారు బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన బిగ్ బాస్ ని తెలుగులోకి కూడా దింపారు. టాలీవుడ్ టాప్ అండ్ స్టార్ హీరో అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను బిగ్ బాస్ సీజన్ 1 కి వ్యాఖ్యాత‌గా తీసుకొచ్చారు. ఈ షో తెలుగులో విపరీతంగా సక్సెస్ అయ్యింది. కేవలం ఎన్టీఆర్ కున్న క్రేజ్ తోనే ఈ షో బంపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు నాని వ్యాఖ్యాతగా బిగ్ బాస్ సీజన్ టు బుల్లితెర మీదకి రావడానికి సిద్దమవుతుంది. ఎన్టీఆర్ బిగ్ బాస్ హోస్ట్ అంటే వచ్చిన క్రేజ్ ముందు ఇప్పుడు నాని బిగ్ బాస్ హోస్ట్ అంటే అంతగా క్రేజ్ వచ్చినట్టుగా అనిపించడం లేదు, అందుకే స్టార్ మా వారు ఈ షో కి క్రేజ్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు.

హైప్ క్రియేట్ చేసే ప‌నిలో నాని..

ఈ బిగ్ బాస్ 2 షో జూన్ 10 నుండి స్టార్ మా లో ప్రసారం కాబోతుంది. ఈ విషయాన్నీ బిగ్ బాస్ హోస్ట్ నేచురల్ స్టార్ నాని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. బిగ్ బాస్ 2 షో ఈసారి 100 రోజులుంటుందని, 16 మంది పార్టిసిపేట్స్ పాల్గొంటున్నారని.. 1 బిగ్ హౌస్.. బిగ్ బాస్ 2... అంటూ నాని ట్వీట్ చేశాడు. మరి మాస్ ప్రోమోస్ తో నాని బిగ్ బాస్ షో మీద హైప్ క్రియేట్ చెయ్యడానికి తనవంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఐదు రోజులపాటు పార్టిసిపేట్స్ మొహాలు చూసే ప్రేక్షకులకు... శని, ఆదివారాల్లో నాని చేసే వ్యాఖ్యానాన్ని వీక్షించొచ్చు. గెట్ రెడీ మరో పది రోజుల్లోనే స్టార్ మా వారు బిగ్ బాస్ 2 ని బ్రహ్మాండంగా స్టార్ట్ చెయ్యబోతున్నారు. మరి మీరు రెడీ అయిపోండి. వెండితెర మీద నాని చేసే యాక్టింగ్ చూసిన ప్రేక్షకులు బుల్లితెర మీద నాని చేసే యాంకరింగ్ కి ఎలా థ్రిల్ అవుతారో.. చూడాలి.

Similar News