ఈసారి ఇంకొంచం మసాలా.. ఏదైనా జరగొచ్చు.. అంటూ బిగ్ బాస్ నిర్వాహకులు ప్రోమోస్ ని బాగా ప్రమోట్ చేసారు. బిగ్ బాస్ స్టార్ట్ అయి సరిగ్గా వారం అవుతుంది. కానీ వాళ్లు చెప్పినట్టు మసాలా ఏమి కనిపించలేదు నిన్నటి వరకు. అయితే నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి సామాన్యురాలి హోదాలో హౌస్‌లో ఎంటర్ అయిన సంజన అన్నే ఎలిమినేషన్‌కి గురయింది. దీంతో షో పైన కొంచం ఇంట్రెస్ట్ కలిగింది. ఆమె ఎలిమినేట్ అవ్వగానే మరో యువతిని హౌస్‌లోకి పంపించి మసాలా పాళ్లు తగ్గకుండా చూసుకున్నారు. కొత్తగా హౌస్ లోకి ఎంటర్ అయిన యువతి పేరు నందిని రాయ్. ఈమె మిస్ ఆంధ్రా కిరీటాన్ని గెలుచుకుంది. తెలుగు,తమిళ చిత్రాల్లో కూడా నటించింది. సుధీర్ బాబు హీరోగా వచ్చిన 'మోసగాళ్లకి మోసగాడు' చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించింది.
షోకి ఇంకాస్త గ్లామర్
బిగ్ బాస్ లో గ్లామర్ వున్న భామలకి లాంగ్ రన్ వుంటుందనేది తెలిసిందే. గత సీజన్ లో అర్చన, దీక్ష చాలాకాలం వరకు బిగ్ బాస్ లో కొనసాగారు. అలానే ఈ సీజన్ లో ఆల్రెడీ తేజస్వి, భానుశ్రీ, దీప్తి ఉన్నారు. వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా వుంది. మరి ఇప్పుడు నందిని రాయ్ హౌస్ లోకి వెళ్లి అందరితో ఎలా ఉంటుందో..తన వల్ల హౌస్‌లో ఎలాంటి డైమెన్షన్ వస్తుందో చూడాలి. కానీ ఆమె ఇంకా హౌస్ లోకి ఎంటర్ అవ్వలేదు. సమయం వచ్చినప్పుడు ఎంటర్ అవుతుందని నాని చెప్పాడు.