చివరికి సీజన్ 4 విన్నర్ పరిస్థితి

కరోనా టైం లో బిగ్ బాస్ మొదలవుతుంది అనగానే అందరిలో.. ఈ షో జరుగుతుందో.. లేదో అనే అనుమానం ఉన్న స్టార్ మా దాన్ని సక్సెస్ చేసి [more]

Update: 2020-12-22 08:40 GMT

కరోనా టైం లో బిగ్ బాస్ మొదలవుతుంది అనగానే అందరిలో.. ఈ షో జరుగుతుందో.. లేదో అనే అనుమానం ఉన్న స్టార్ మా దాన్ని సక్సెస్ చేసి చూపించింది. కాకపోతే షో ఇంట్రెస్ట్ గా లేదు.. అయినా చిరు గ్రాండ్ ఎంట్రీ తో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షో ని ముగించారు. బిగ్ బాస్ పూర్తయినా దాని వార్తలు సోషల్ మీడియాని వదలడం లేదు. అయితే బిగ్ బాస్ కి వెళ్లి ఎవరు ఏం సాధించారు అంటే.. చెప్పడానికి ఏం కనిపించడం లేదు. ఏదో సీజన్ 3 లో టాప్ 2 వరకు వెల్లిన శ్రీముఖి గతంలో ఎలా ఉందో బగ్ బాస్ కి వెళ్లొచ్చాక కూడా తన యాంకరింగ్ అవకాశంతో అలానే చెలరేగిపోతుంది తప్ప.. అందులో కొత్తగా ఏం లేదు. ఇక సీజన్ 1 విన్నర్ శివ బాలాజీ అయితే బిగ్ బాస్ టైటిల్ గెలిచాక మళ్ళి సోది లోకి లేకుండా పోయాడు. ఇక సీజన్ 2 విన్నర్ కౌశల్ అయితే సినిమా అవకాశాలతో, డైరెక్టర్ గా బిజీ అవుతున్నాడు, హీరోగా సినిమాలు మొదలవుతున్నాయ్.. అబ్బో ఆఫర్లే ఆఫర్లు అంటూ తెగ డబ్బా కొట్టినా చివరికి మిగిలింది ఏం లేదు.

మూడు సీజన్స్ లో గెలిచిన వారు టాస్క్ ల విషయంలో బద్దకస్తులు. కాకపోతే వారికీ బయట క్రేజ్ ఉన్న కారణముగా ప్రేక్షకుల ఓట్స్ తో గెలిచేసారు. మూడో సీజన్ లో గెలిచినా విన్నర్ రాహుల్ సింప్లి గంజ్ కుడా తన ఆల్బమ్స్ తోనూ, సింగర్ గాను బిజీ అయ్యాడు తప్ప రాహుల్ కి బిగ్ బాస్ తో ఒరిగింది ఏం లేదు. తాజాగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా వెలిసాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత ఎనిమిదేళ్ళకి బిగ్ బాస్ ద్వారా మళ్ళీ జనాలకు కనబడిన అభిజిత్ కి బిగ్ బాస్ నుండి బయటికి రాకుండానే ఆఫర్స్ వచ్చేసినట్టుగా ప్రచారం షురూ అయ్యింది. లైం లైట్ లో లేకుండా బిగ్ బాస్ కి వచ్చిన అభిజిత్ విన్నర్ అయితే కాగలిగాడు.. కానీ మూడు సీజన్స్ విన్నర్స్ ఎలా ఉన్నారో అభిజిత్ కూడా అలానే ఉంటాడో.. లేదంటే కెరీర్ లో బిజీ అవుతాడో. అప్పుడే చెప్పలేం కానీ.. అభిజిత్ అవకాశాల ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది.

Tags:    

Similar News