బోయపాటి - రామ్ చరణ్ కాంబినేషన్ లో 110 కోట్ల ఖర్చుతో రూపొందుతున్న చిత్రం వినయ విధేయ రామ. తాజాగా ఈ సినిమాపై ఓ గ్యాసిప్ వినిపిస్తోంది. ముందుగా అనుకున్న దానికన్నా వర్కింగ్ డేస్ భయంకరంగా పెరిగిపోయాయట. ఇప్పటికే ఈ సినిమా వందకు పైగా వర్క్ డేస్ అయ్యాయి. ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వాలంటే మరో 30 - 35 రోజుల వరకు అవసరం ఉంది. మరి డేట్స్ అయిపోయాయో లేదా ఏమైనా తేడా వచ్చిందో తెలియదు కానీ ఈ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ రుషి పంజాబీ వెళ్లిపోయినట్టు సమాచారం. అతని ప్లేస్ లో కొత్తగా మళ్లీ ఆర్ధర్ విల్సన్ ను తీసుకుని, అతనికి మళ్లీ రెమ్యూనిరేషన్ సెట్ చేసినట్లు వినికిడి.
అదేం లేదు అంటున్న బోయపాటి
సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుందనుకుంటే ఇదొక ట్విస్ట్ ఇప్పుడు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాకు నిర్మాత దానయ్యకు ఓవర్ బడ్జెట్ అవుతుంది. అయితే ఇందులో నిజం లేదని.. అనుకున్న బడ్జెట్ లోనే సినిమాను తీస్తున్నాం అని బోయపాటి టీం చెబుతున్న మాట. అసలు ఇటువంటి విషయాలు ఎవరు లీక్ చేస్తున్నారు అన్న విషయంపై ఆరా తీస్తున్నాడు బోయపాటి. దసరాకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తారు అనుకుంటే.. అది దీపావళి కి పోస్ట్ పోన్ అయింది.