ప్రస్తుతం నందమూరి, మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు రాజమౌళి సినిమా కోసం ఎప్పుడు రెడీ అవుతారు... అలాగే రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ ల మల్టీస్టారర్ సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకెళతాడు అనే ఉత్సుకతతో ఉన్నారు. అయితే మీడియాలో రాజమౌళి ఈ మల్టీస్టారర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో లేదు.. ప్రస్తుతం మగధీర సినిమాని జపానీస్ భాషలో జపాన్ లో విడుదల చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు విన్నాక ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ కాస్త డీలా పడ్డారు.
అక్టోబరుకు ఎన్టీఆర్ ఫ్రీ...
అయితే ఎన్టీఆర్ మరియు చరణ్ ల మల్టీస్టారర్ ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్లుగానే అక్టోబర్ నుండి పక్కాగా సెట్స్ మీదకెళుతుంది అని అంటున్నారు. ఇప్పటికే కథ మీద కూర్చున్న విజయేంద్రవర్మ కథ ఫైనల్ కాగానే రాజమౌళి పక్కగా స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించేస్తాడట. ఈ లోపు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల అరవింద సామేత సినిమా ఒక కొలిక్కి రావడమే కాదు.. అరవింద సామెత వీర రాఘవని దసరా కానుకగా విడుదల చేసేందుకు గాను షూటింగ్ ని వేగంగా పరిగెత్తిస్తున్నారు ఎన్టీఆర్, త్రివిక్రమ్ లు. ఇక ఎన్టీఆర్ అక్టోబర్ కి ఫ్రీ అవుతాడు.
నవంబర్ నుంచి ప్రారంభం...
ఇక రామ్ చరణ్ - బోయపాటిల మూవీ సంక్రాతి బరిలో ఉన్నప్పటికీ.. రామ్ చరణ్ తన షూటింగ్ ని నవంబర్ కల్లా పూర్తి చేసి ఫ్రీ అవుతాడట. ఇక బోయపాటి మాత్రం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను నవంబర్, డిసెంబర్ లలో కానిచ్చేసి సినిమాని సంక్రాంతికి తయారు చేస్తాడట. ఇక రాజమౌళి చెప్పిన టైం కి చెప్పినట్టుగా రామ్ చరణ్ కూడా పక్కాగా సెట్స్ మీదకెళ్తాడట. సో ముందు నుండీ అనుకున్నట్టుగానే రాజమౌళి ఈ మల్టీస్టారర్ ని అక్టోబర్ లో మొదలు పెట్టి... నవంబర్ చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ కనిచేస్తాడట. సో నందమూరి, మెగా అభిమానులూ డోంట్ వర్రీ.