చిరు పక్కన తమన్నా, హ్యూమా కాదా... మరి..!

Update: 2018-11-12 08:50 GMT

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీతో వచ్చిన చిత్రం 'ఖైదీ నెంబర్ 150 ' తరువాత చేస్తున్న చిత్రం 'సైరా'. ఈ చిత్రం కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తరువాత చిరంజీవి కొరటాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడని తెలిసిన విషయమే. కొరటాల సినిమా కాబట్టి ఈ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు ఏర్పడ్డాయి. కొరటాల చెప్పిన కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో చిరు ఓకే చేసేసాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ లో బిజీగా ఉన్నాడు కొరటాల.

చిరు సరసన కియారా..?

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. చిరు సరసన కియారా అద్వానీ నటించనుందని వార్తలు వస్తున్నాయి. కొద్దిగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ పేరును స్వయానా డైరెక్టర్ కొరటాల సజెస్ట్ చేసినట్టు సమాచారం. కియారాను టాలీవుడ్ కు పరిచయం చేసిన వ్యక్తి కొరటాల శివ. తన తొలి తెలుగు సినిమా సూపర్ స్టార్ మహేష్ పక్కన చేసే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు మెగా స్టార్ పక్కన. మరి చిరు పక్కన కియారాను ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారో అర్ధం కానీ విషయం. చిరు పక్కన కియారా కూతురులా ఉంటుంది. మరి ఇది సాహసమే అని చెప్పాలి. ప్రస్తుతం కియారా రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలో నటిస్తోంది. తరువాత చిరుతో నటించనుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిందే.

Similar News