చిరు డేరింగ్ స్టెప్!

Update: 2018-06-01 07:27 GMT

ఇప్పుడున్న పెద్ద హీరోలలో ఎవరు ఒకేసారి రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారో చెప్పండి చూద్దాం. సాధారణంగా సినిమాను కంప్లీట్ చేయాలంటే కనీసం ఏడాది టైం తీసుకుంటున్నారు. అలాంటిది ఒకేసారి రెండు సినిమాలు చేయడం కష్టమే అని చెప్పాలి. కానీ మెగాస్టార్ చిరంజీవి తన పాత రోజులు గుర్తు చేస్తూ ఒకేసారి రెండు సినిమాలు చేయడానికి రెడీ అయి పోయారు.

ఇంకా 30 శాతమే...

ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన తర్వాత సినిమా త్వరగానే ఖాయం చేసుకుని మరింత గ్రాండ్ గా ఉండే ఉద్దేశంతో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రలో యాక్ట్ చేస్తున్నాడు. నవంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పటికి 7-8 నెలలు గడిచిపోయినా.. ఇంకా 30 శాతం షూటింగ్ మాత్రమే చేశారని తెలుస్తోంది. సో ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టె అవకాశం ఉండడంతో చిరు ఈ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు.

పుట్టినరోజు నాడే ప్రకటన...

కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు మెగాస్టార్ సిద్ధమయ్యారని ఇప్పటికే టాక్ ఉంది. కొరటాల చెప్పిన కథ చిరుకి నచ్చడంతో ఆ సబ్జెక్టును ఒకే చేసాడని.. ఈ ఏడాది ఆగస్ట్ 22న చిరు బర్త్ డే సందర్భంగా.. అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తోంది. ఒక నెల గ్యాప్ ఇచ్చి ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేస్తారట. అటు సైరా చిత్రంలో యాక్ట్ చేస్తూ మరో పక్క కొరటాల మూవీ షూటింగ్ లో పాల్గొంటారట చిరు. రెండు సినిమాల్లో గెటప్స్ విషయంలో తేడా రాకుండా షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నాడంట కొరటాల. చిరు ఇటువంటి డెసిషన్ తీసుకోవడంతో ఇండస్ట్రీలో చాలా మంది అభినందిస్తున్నారు.

Similar News