సిరివెన్నెల ఇక లేరు
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతిచెందారు.
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణించారు. ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 24వ తేదీన కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మరణించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి న్యమోనియోతో బాధపడుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సిరవెన్నెల మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. 66 ఏళ్ల సిరివెన్నెల కన్నుమూయడంతో టాలీవుడ్ ఒక దిగ్గజాన్ని కోల్పోయినట్లయింది.
సిరివెన్నెలతో....
1955లో అనకాపల్లిలో జన్మించన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంఏ చేస్తూ దర్శకుడు కె.విశ్వనాధ్ ఆహ్వానం మేరకు సినీరంగంలోకి వచ్చారు. సిరిెవెన్నెల సినిమాకు పాటలు రాసి ఆయన తన ఇంటిపేరును సిరివెన్నెల గా మార్చుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. సిరివెన్నెల పార్ధీవ దేహాన్ని ఈరోజు రాత్రికి కిమ్స్ లోనే ఉంచుతారు. అభిమానుల సందర్శనార్థం రేపు ఐదు గంటలకు ఫిలిం ఛాంబర్ లో ఉంచుతారు.