'మహాభారతం'పై ఇప్పటికే చాలా సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. ఇంకా కొత్తగా ఏం చూపిస్తాం అని చాలా మంది దీన్ని ముట్టుకోలేదు. పైగా పౌరాణికతో కూడుకుంది కాబట్టి.. ఖర్చు ఎక్కువ అయ్యి మళ్లీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఇటువంటి ప్రాజెక్ట్ సెట్స్ మీదకి తీసుకునివెళ్లటం కష్టం అని ఎవరూ దాని జోలికి వెళ్ళలేదు.
రాజమౌళి చాలా సార్లు....
కానీ ఇప్పుడున్న డైరెక్టర్స్ సాంకేతికతను ఉపయోగించుకుని ఆ కథను భారీతనంతో చెబితే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందన్న నమ్మకంతో వేర్వేరు పరిశ్రమలకు చెందిన ప్రముఖ దర్శకులు.. హీరోలు మహాభారత కథతో సినిమా చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే 'మహాభారతం' ను సినిమాగా తీయడం తన కల అని.. కానీ పదేళ్లు తర్వాత దాని గురించి ఆలోచిస్తానని రాజమౌళి చాలా సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
ఎవరు తీసుకెళతారో?
మరోవైపు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో భీముడి కోణంలో మహాభారత గాథను తెరకెక్కించడానికి శ్రీకుమార్ అనే దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు. ఇంకోపక్క బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ‘మహాభారతం’ తీసేందుకు సన్నాహాల్లో ఉన్నాడు. ఈ విషయాన్నీ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. ‘మహాభారతం’ను ఒక సినిమాగా తీయడం సాధ్యం కాదన్నాడు. ఇదొక బృహత్తరమైన ప్రాజెక్టు అని.. ఈ మొత్తం కథను భారీగా తీయాలంటే 20 ఏళ్లు పడుతుందని అతను చెప్పాడు. ఇంతకుమించి ఇప్పుడేమీ చెప్పలేనన్నాడు. అంటే అమీర్ ఖాన్ మాటలు ప్రకారం చూస్తే ‘మహాభారతం’ కచ్చితంగా తెరమీదకు తీసుకుని వెళ్ళేటట్టే కనిపిస్తున్నాడు. ఒకవేళ తీయాలన్న ఆయన వయసు సరిపోదు. మరి అవి ఏమి పాటించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడేమో చూడాలి. మరి ‘మహాభారత’ కథను ఎవరు సెట్స్ మీదకు తీసుకునివెళ్తారో? జక్కన్న?..లేదా అమీర్ ఖానా?