కెజిఎఫ్ 2 క్లైమాక్స్ ఇదేనా..?

ఎటువంటిది అంచనాలు లేకుండా యశ్ హీరోగా వచ్చిన కెజిఎఫ్ సినిమా అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈసారి దర్శకుడు ప్రశాంత్ నీల్.. కెజిఎఫ్ చాప్టర్ 2 [more]

Update: 2020-04-04 10:52 GMT

ఎటువంటిది అంచనాలు లేకుండా యశ్ హీరోగా వచ్చిన కెజిఎఫ్ సినిమా అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈసారి దర్శకుడు ప్రశాంత్ నీల్.. కెజిఎఫ్ చాప్టర్ 2 అంటూ భారీ బడ్జెట్ తో భారీ గా తెరకెక్కిస్తున్నాడు. అక్టోబర్ 2 న విడుదల డేట్ ప్రకటించిన కెజిఎఫ్ 2 లో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తుంటే… బాలీవుడ్ భామ రవీనా టాండన్ ఓ నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ ప్లే చేస్తుంది. అయితే సంజయ్ దత్ ముఖ్యమైన విలన్ రోల్ ప్లే చేస్తుంటే… రవీనా టాండన్ దేశ ప్రధాని గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుంది.

అయితే కెజిఎఫ్ 2 అప్ డేట్ కోసం ఎప్పుడు ప్రేక్షకులు క్యూరియాసిటీతోనే ఉంటున్నారు. తాజాగా కెజిఎఫ్ 2 సినిమా విషయంలో బయటికొచ్చిన ఓ న్యూస్ వింటుంటే యశ్ అభిమానులే కాదు.. ఎవ్వరికైనా గూస్ బమ్స్ వస్తాయి. అది కెజిఎఫ్ 2 లో క్లైమాక్స్ అదుర్స్ అంట. సినిమాకి క్లైమాక్స్ కీలకం అంటున్నారు. ఇక కెజిఎఫ్ 2 కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయ్యింది. మరి సోషల్ మీడియా కథనం ప్రకారంగా.. రాఖి భాయ్ నిర్మించుకున్న సామ్రాజ్యం కూల్చేయడమే కాకుండా అతని మరణానికి కూడా ఆమె కారణం అవుతుందట. ప్రత్యర్థులను చంపివేసి కెజిఎఫ్ కి కింగ్ గాఎదిగిన రాఖీని ప్రభుత్వ సైన్యం సహకారంతో రవీనా టాండన్ చంపించి వేస్తుందని తెలుస్తుంది. అమ్మ మాట ప్రకారం రాఖి రాజు హోదాలో ఆనందంగా చనిపోతాడని టాక్. కె జి ఎఫ్ 2 క్లైమాస్స్ లో రాఖీ భాయ్ చనిపోతాడని అంటున్నారు. మరి అందులో నిజమెంతుందో అనేది సినిమా చూస్తే కానీ తెలియదు.

Tags:    

Similar News