లోకనాయకుడితో డేటింగా?

కమల్ హాసన్ మొదటి భార్య ని వదిలేసి నటి సారిక తో చాలా కాలం సహజీవనం చేసాడు. సారిక కూడా కమల్ హాసన్ నుండి విడిపోయి తన [more]

;

Update: 2020-05-28 04:49 GMT
Pooja Kumar
  • whatsapp icon

కమల్ హాసన్ మొదటి భార్య ని వదిలేసి నటి సారిక తో చాలా కాలం సహజీవనం చేసాడు. సారిక కూడా కమల్ హాసన్ నుండి విడిపోయి తన కూతురితో వేరుగా వెళ్ళిపోయింది. అయితే కమల్ హాసన్ మరో నటితో డేటింగ్ లో ఉన్నాడనే న్యూస్ ఆ మధ్యన సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా కమల్ తో ఆ హీరోయిన్ డేటింగ్ అంటూ వచ్చిన వార్తలపై సదరు హీరోయిన్ స్పందించింది. ఆమె ఎవరో కాదు కమల్ హాసన్ తో రెండు మూడు సినిమాల్లో కలిసి పనిచేసిన పూజ కుమార్. విశ్వరూపం, ఉత్తమ విలన్, విశ్వరూపం 2లలో కమల్ తో కలిసి నటించిన పూజ కుమార్ తో కమల్ తో డేటింగ్ లో ఉందని ప్రచారం జరుగుతుంది.

అయితే తాజాగా పూజ కుమర్ కమల్ తో డేటింగ్ న్యూస్ పై స్పందించింది. కమల్ హాసన్ తో సినిమాల్లో నటించిన నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్ లాగ వాళ్ళ కుటుంబం తో కలిసిపోయాను. చాలా ఏళ్లుగా కమల్ ఆయన ఫ్యామిలీ నాకు తెలుసు. కమల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నపాటినుండే కమల్ ఫ్యామిలీకి దగ్గరయ్యాను. కమల్ హాసన్ సోదరుడు.. ఆయన కుమార్తెలైన శృతి హాసన్, అక్షర హాసన్ అందరూ నాకు తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి నన్ను తప్పకుండా పిలుస్తారు. అంతేకాని కమల్ తో నాకు ఇతర సంబంధం ఏమి లేదు అంటూ చెప్పింది.

Tags:    

Similar News