Puneeth rajkumar : పునీత్ ను చివరి సారి… జూనియర్ ఎన్టీఆర్…?

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి టాలీవుడ్ లోనూ విషాదం నింపింది. ఆయనతో పరిచయమున్న సినీ నటులు బెంగళూరు వెళ్లారు. పునీత్ రాజ్ కుమార్ [more]

Update: 2021-10-30 06:09 GMT

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి టాలీవుడ్ లోనూ విషాదం నింపింది. ఆయనతో పరిచయమున్న సినీ నటులు బెంగళూరు వెళ్లారు. పునీత్ రాజ్ కుమార్ కు టాలీవుడ్ తో సంబంధాలున్నాయి. ముఖ్యంగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ ను బాగా అభిమానిస్తారు. తన సినిమాల్లోనూ జూనియర్ ను పునీత్ రాజ్ కుమార్ అనుకరిస్తారని చెబుతారు. అంతేకాదు తన సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేత పాట పాడించుకున్నారంటే ఎన్టీఆర్ అంటే ఆయనకు ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు.

చిరు, బాలకృష్ణ….

పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని చివరి సారిగా చూసి నివాళుర్పించేందుకు జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరు బయలుదేరి వెళ్లారు. నిన్ననే ఆయన పునీత్ రాజ్ కుమార్ మృతి వార్త విని షాక్ కు గురయ్యారు. అలాగే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నందమూరి బాలకృష్ణ, చిరంజీవి కూడా బెంగళూరు బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది.

Similar News