ఈ హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు మరీ అంతా..?

Update: 2018-06-13 05:21 GMT

బాలీవుడ్ లో నటి దీపికా పదుకొనేకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ అమ్మడు తన సొట్టబుగ్గలతో నవ్వితే అభిమానులు ఫిదానే. దీపికా తన సినిమాలు, నటనపై ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. ఆచితూచి గానీ పాత్రలను, సినిమాలను ఎంపిక చేసుకోదు. కేవలం సీనిమాలే కాదు, ఆమె బట్టలు, ఉపయోగించే వస్తువులపై కూడా చాలా శ్రద్ధ తీసుకుంటుందంట. తాజాగా, ఆమె ఓ తెల్లటి హ్యాండ్ బ్యాగ్ తో ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. ఆ బ్యాగ్ పై చానెల్ అనే పేరు ఉండటంతో కొందరు ఔత్సాహికులు ఈ బ్యాగ్ కోసం ఇంటర్నెట్ లో వెతికితే ధర చూడగానే కళ్లు బైర్లు కమ్మినంత పనైందంట. పారిస్ కు చెందిన ఓ ఖరీదైన బట్టలు, అప్పియరెల్స్ కంపెనీకి చెందిన ఈ బ్యాగ్ ఖరీదు అక్షరాలా రూ.2 లక్షల 90 వేలు. అంటే, ఈ డబ్బుతో యూరప్ లేదా ఇతర పర్యాటక ప్రదేశాలకు వెళ్లిన కనీపం 10 రోజులు సేద తీరవచ్చని ముక్కున వేలేసుకుంటున్నారు అభిమానులు.

Similar News