ఈ మధ్యన దిల్ రాజుకి బ్యాడ్ టైం నడుస్తుంది. దిల్ రాజు కథ విని సినిమా చేస్తే హిట్ అనే వారు ఇప్పుడు దిల్ రాజు లెక్కలు తప్పుతున్నాయంటున్నారు. దిల్ రాజు ఫ్లాప్ హీరోలకు లైఫ్ ఇస్తానంటూ బయలుదేరి తన మెడకు ఫ్లాప్ లు తగిలించుకుంటున్నాడు. గత రెండు మూడు సినిమాల నుండి దిల్ రాజు ఇదే అనుభవాన్ని పొందుతున్నాడు. ఇక ఎప్పుడూ దిల్ రాజు సెంటిమెంట్స్ ని నమ్ముతుంటాడు. హిట్ కొట్టిన డైరెక్టర్ ని తన బ్యానర్ లో లాక్ చేసి సినిమాకి కమిట్ చేస్తుంటాడు. అయితే తన బ్యానర్ లో ఒకసారి హిట్ కొట్టిన డైరెక్టర్ తో మరోసారి సినిమా చేస్తున్న దిల్ రాజు ఫ్లాప్ అందుకుంటున్నాడు. ఒకే డైరెక్టర్ తో దిల్ రాజు మళ్లీ మళ్లీ పనిచేస్తుంటే అది ఏ మాత్రం కలిసి రావడం లేదు.
బొమ్మరిల్లు నుంచి మొదలు...
బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన బొమ్మరిల్లుతో దిల్ రాజు అదిరిపోయే హిట్ కొట్టాడు. కానీ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన నెక్స్ట్ సినిమా పరుగు అనుకున్నంత హిట్ కాలేదు. అలాగే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తీయగా అది హిట్టయ్యింది. ఆ తరవాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన డీజే దువ్వాడ జగన్నాథం హిట్ అని చెప్పినా... ఫ్లాప్ అయ్యింది. ఇక దిల్ రాజు సతీష్ వేగ్నేశతో తీసిన శతమానం భవతి హిట్ కొట్టడమే కాదు.. జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. కానీ అదే డైరెక్టర్ తో చేసిన శ్రీనివాస కళ్యాణం ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. ఇక గత ఏడాది త్రినాథరావు నక్కినతో తీసిన ఎంసీఏ అనుకోకుండా సూపర్ హిట్ అయ్యింది.
బ్రేక్ చేసిన అనీల్ రావిపూడి
అదే త్రినాథ రావు తో చేసిన హలో గురు ప్రేమ కోసమేకు యావరేజ్ టాకొచ్చింది. ఈ సినిమా కూడా ఎంసీఏ లాగా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వచ్చిపడితే హిట్ అవుతుంది. ఇక ఇవన్నీ ఇలా ఉంటే తన బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి అనిల్ రావిపూడితో చేసిన సుప్రీంతో ఒక మాదిరి హిట్ అందుకున్న దిల్ రాజు.. రాజా ది గ్రేట్ తో మంచి హిట్ అందుకున్నాడు. మరి అనిల్ రావిపూడితో చేసిన రెండు సినిమాలు హిట్ అందుకున్న దిల్ రాజు మూడో సినిమా ఎఫ్ 2 తో ఎలాంటి హిట్ కొడటాడో చూద్దాం.