డిఫరెంట్ కథలతో, ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి. తన సినిమాల్లో ప్రతి పాత్ర అందరికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దడం ఆయన స్టైల్. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ దాకా స్క్రీన్ ప్లే తో కట్టిపడేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అంతే కాకుండా తన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ని ఎక్కడ మిస్ కాకుండా చూసుకుంటారు.
బుట్టలో వేసుకున్న దిల్ రాజు
ఈ విషయం లేటెస్ట్ గా వచ్చిన 'సమ్మోహనం' సినిమాతో మరోసారి రుజువైంది. ఆ సినిమా ఆయనను దర్శకుడిగా మరింత ఎత్తులో కూర్చోబెట్టింది. చిన్న హీరోస్ నుండి స్టార్ హీరోస్ దాకా అందరూ ఆయనతో సినిమా తీయాలని ఎదురుచూస్తున్నారు. యంగ్ హీరోస్ అయితే ఆయన సినిమాలో చేయడానికి తెగ ఉత్సాహాన్ని చూపించేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన బ్యానర్ లో సినిమా చేయాలంటూ మోహన్ కృష్ణ ఇంద్రగంటి డేట్స్ ను లాక్ చేసాడు నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు బ్యానర్ లో ఇంద్రగంటికి ఛాన్స్ దొరికిందంటే అంతకు మించి ఆయనకు ఏం కావాలి. ఈ ఇద్దరి కాంబినేషన్లో వరుసగా సినిమాలు వచ్చే అవకాశాలు వున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.