హీరో రామ్ - అనుపమ కాంబినేషన్ లో 'హలో గురూ ప్రేమ కోసమే' అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను 'నేను లోకల్' ఫేమ్ త్రినాధరావు రూపొందిస్తున్నారు. అక్టోబర్ 18న విడుదల అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి రీసెంట్ గా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు విడుదల అవ్వాల్సిన 'నోటా' సినిమాను అక్టోబర్ 5కు ఫిక్స్ అయ్యేలా చేసారు దిల్ రాజు. ఎందుకంటే తన సినిమాకి అడ్డుగా 'నోటా' వస్తుందని.
దిల్ రాజు జోక్యంతో...
అందుకుగాను హీరో విజయ్ తో పాటు నిర్మాత జ్ఞానవేల్ రాజాని కూడా ఒప్పించాడు రాజు. అయితే 'నోటా' సినిమా తెలుగులో రిలీజ్ అవ్వాలంటే కొన్ని పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయట. ఈ సినిమాకు సంబంధించి తెలుగు టైటిల్ వ్యవహారాలు ఏవో పెండింగ్ లో వున్నాయని వినికిడి. అవన్నీ ఫినిష్ అయిన తర్వాత సినిమా సెన్సార్ కు వెళ్లనుంది. కానీ ఇవన్నీ చేయాలంటే టైం లేదు. ఎందుకంటే అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల అవుతుంది. పట్టుమని పది రోజులు కూడా లేదు.
బాధ్యతలు పెట్టిన జ్ఞానవేల్...
దీంతో ఇన్ని పనులు అవ్వాలంటే జ్ఞానవేల్ రాజాకు ఇక్కడ ఎవరూ తెలియదు కాబట్టి ఆయన దిల్ రాజు సహకారం తీసుకుని ఆ పనులన్నీ ఆయనతో చేయించుకుంటున్నారట. దిల్ రాజు సినిమా కోసం జ్ఞానవేల్ రాజా తన సినిమాని వాయిదా వేసుకున్నప్పుడు దిల్ రాజు ఆ మాత్రం చేయలేడా.. అందుకే ఆ బాధ్యతలు తనపై వేసుకుని చేస్తున్నారు రాజు.