నిర్మాత దిల్ రాజుకి ఈ ఏడాది అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. అతను తీసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో ఆయన మహేష్ 'మహర్షి' సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈసినిమాను ఎలాగైనా హిట్ చేయాలనీ కథ విషయం చాలా జోక్యం చేసుకుంటున్నాడట రాజు. కథ ప్రకారం ఇందులో రెండు ఫైట్స్ కే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
మరో రెండు ఫైట్లు.....
చాలావరకు సినిమా మొత్తం ఎమోషనల్ కంటెంట్ - కామెడీ - రొమాన్స్ తో సాగుతుందట. అయితే రాజు మాస్టర్ ప్లాన్ వేసి ఈ సినిమాలో మరో రెండు ఫైట్ల ను జోడించమని కోరుతున్నాడట. అందుకు కారణం బాలీవుడ్ లో ఈసినిమాను ఎక్కువ రేట్ కి అమ్ముకోవచ్చని. బాలీవుడ్ లో సినిమా సేల్ అవ్వాలంటే యాక్షన్ డోస్ చాలా అవసరం. ఇలా చేస్తే హిందీ డబ్బింగ్ రైట్స్ నుండి రూ.25 కోట్లు వస్తాయి అని రాజు ఆశిస్తున్నాడట.
మహేష్ మాత్రం.....
అయితే మహేష్ మాత్రం అందుకు నో అనే చెప్పుతున్నాడట. స్క్రిప్ట్ ప్రకారం రెండు ఫైట్లు మాత్రమే పెడదాం అని అనవసరంగా కొత్త ఫైట్లు జోడించడం సరికాదని మహేష్ అంటున్నాడట. దీనికి సంబంధించి మహేష్ - దిల్ రాజు మధ్య చర్చ జరుగుతుందని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.