నాగచైతన్య హీరోగా వివేక్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన బెజవాడ సినిమా ఘోరమైన డిజాస్టర్ అయ్యింది. కానీ వివేక్ కృష్ణ మాత్రం సినిమా పోయినా పర్లేదు.. కేవలం క్రిటిక్స్ ఇచ్చిన రివ్యూలపై విమర్శలు చేశారు. పలు ఛానల్స్ లో లైవ్ ఇంటర్వూస్ లో పాల్గొన్న వివేక్ కృష్ణ రివ్యూ రైటర్స్ సరిగ్గా రివ్యూలు రాయడం లేదని.. వాళ్లకి రివ్యూలు రాయడం చేతకాదని అన్నాడు. ఆ తర్వాత వివేక్ కృష్ణ మళ్లీ కనబడలేదు. తర్వాత స్టార్ హీరోలు సైతం రివ్యూస్ మీద విరుచుకుపడినప్పటికీ... మరీ ఘోరంగా క్రిటిక్స్ ని, మీడియాని చులకన చెయ్యలేదు. కానీ ఇప్పుడొక యువ డైరెక్టర్ తన వీర భోగ వసంత రాయులు సినిమాకి సరైన రివ్యూస్ ఇవ్వలేదని.. క్రిటిక్స్ ని, రివ్యూ రైటర్స్ ని ఉద్దేశింది.. ఒక వెకిలి పోస్టర్ విడుదల చేసాడు. వీర భోగ వసంత రాయులు డైరెక్టర్ ఇంద్రసేన ‘ఫక్ ఆల్ రివ్యూస్’ అంటూ ఒక పోస్టర్ ని విడుదల చేసి రివ్యూ రైటర్స్ మీద పడాలనుకున్నాడు.
క్లాస్ తీసుకున్న హీరోలు
అసలు వీర భోగ వసంత రాయులు సినిమాకి రివ్యూ రైటర్స్ 1 రేటింగ్ ఇవ్వడమే ఎక్కువ. ఆ సినిమా అంత చెత్తగా ఉంది. కేవలం క్రిటిక్స్ మాత్రమే ఆ మాట అనడం లేదు.. ప్రేక్షకులు కూడా సినిమా చూసిన తర్వాత అదే మాటంటున్నారు. ఆ సినిమాలో విషయం లేదని రివ్యూ రైటర్స్ ఓవర్సీస్ టాక్ తోనే తేల్చేశారు. అలాగే ఇక్కడ విడుదలయిన మొదటి షోకే సినిమా చెత్త అంటూ కాంప్లిమెంట్స్ వచ్చేసాయి. అయితే రివ్యూ రైటర్స్ సినిమాకి చెత్త రివ్యూ అంటూ ఇచ్చేసరికి కడుపు మండిన ఇంద్రసేన ఈ పోస్టర్ విడుదల చేశాడు. అయితే ఆలా పోస్టర్ విడుదల చేసిన కొద్దిసేపటికే ఆ సినిమాలో హీరోలుగా నటించిన నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు దర్శకుడు ఇంద్రసేనకి క్లాస్ పీకారట.
దర్శకుడితో సంబంధం లేదు...
అసలే ఫ్లాప్స్ లో ఉన్న హీరోలయే.. ఇపుడు మీడియాని, రివ్యూ రైటర్స్ తో పెట్టుకుంటే వారి భవిష్యత్తు ఏమవుతుందో వారికి తెలుసు. అందుకే ఇంద్రసేనకి క్లాస్ పీకి వదిలారు. కేవలం క్లాస్ కాదు అసలు దర్శకుడు ఇంద్రసేనకి, తమకి సంబంధమే లేదంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. మరి ఈ దర్శకుడుకి ఎంతగా తన చెత్త సినిమా మీద నమ్మకం లేకపోతె టాప్ డైరెక్టర్ సుకుమార్ ని ఒక ఈవెంట్ లో స్టేజ్ మీదే మీరు తీసిన వన్ నేనొక్కడినే నచ్చలేదని చెప్పాడు. మరి తనకైతే నచ్చలేదని చెప్పే హక్కుంటుంది కానీ రివ్యూ రైటర్స్ కి మాత్రం ఉండదా ఇదెక్కడి న్యాయం అంటున్నారు రివ్యూ రైటర్స్.