ఈ దసరా పండగకు వారం ముందే రిలీజ్ అయిన 'అరవింద సమేత' జోరు బాక్సాఫీస్ వద్ద తగ్గిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఈ సినిమా 85 కోట్లు వసూల్ చేయగా.. ప్రాఫిట్స్ లోకి వెళ్లాలంటే ఇంకా 10 కోట్లు దక్కించుకుంటే కానీ సేఫ్ జోన్ లోకి వెళ్లదు. ఓవర్ అల్ రన్ లో ఆ 10 కోట్లు దక్కించుకోడం పెద్ద కష్టమేమి కాదు అని ట్రేడ్ చెబుతుంది. ప్రస్తుతం ఉన్న సినిమాలు ఏవీ పెద్దగా పోటీ లేకపోవడంతో ఇది పెద్ద కష్టమేమి కాదు. ఇక కరెక్ట్ గా దసరా రోజు విడుదల అయినా 'హలో గురు ప్రేమ కోసమే' సినిమా యావరేజ్ టాక్ తో 14 కోట్ల పైచిలుకు షేర్ తెచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 24 కోట్ల బిజినెస్ జరపగా..ప్రాఫిట్స్ లోకి వెళ్లాలంటే ఇంకా 10 కోట్లు అవసరం ఉంది. కానీ యూత్ నుంచి రిపీట్ ఆడియన్స్ వచ్చేంత మ్యాటర్ ఇందులో లేకపోవడం మైనస్ గా మారింది. దీంతో 10 కోట్లు రావడం కష్టం అయ్యే అవకాశం ఉంది.
విజేత అరవింద సమేత...
ఇక అదే రోజు విడుదల అయిన విశాల్ 'పందెం కోడి 2 ' డిజాస్టర్ టాక్ తో థియేటర్స్ లో డల్ అయిపోయింది. 10 కోట్ల 50 లక్షల దాకా బిజినెస్ చేసింది. వీకెండ్ కలుపుకుని ఇప్పటి దాకా వచ్చింది 5 కోట్ల షేర్ మాత్రమే. ఈ సినిమా సేఫ్ లోకి వెళ్లాలంటే ఇంకా 5 కోట్లు కావాల్సి ఉంది. డిజాస్టర్ తో ఇది చాలా కష్టమని సమాచారం. మొత్తానికి ఈ దసరాకు విన్నర్ గా 'అరవింద సమేత' యునానిమస్ గా గెలిచేసింది. ఇంకా 10 కోట్లు రావాల్సినప్పటికీ అది పెద్ద కష్టం కాదని ట్రేడ్ రిపోర్ట్.