బాబోయ్ మోనాల్.. ఇక ఆపేయ్!

బిగ్ బాస్ సీజన్ 3 లో శివ జ్యోతి ఎమోషనల్ గా ప్రేక్షకులను ఏడిపిస్తే.. సీజన 4 లో మోనాల్ ఏడుపు చూసి ప్రేక్షకులు ఎమోషనల్ అవడం [more]

Update: 2020-12-10 09:03 GMT

బిగ్ బాస్ సీజన్ 3 లో శివ జ్యోతి ఎమోషనల్ గా ప్రేక్షకులను ఏడిపిస్తే.. సీజన 4 లో మోనాల్ ఏడుపు చూసి ప్రేక్షకులు ఎమోషనల్ అవడం పక్కనబెట్టి మోనాల్ ఏడుపు చూసి కామెడీ చేస్తున్నారు. మోనాల్ గజ్జర్ ఉంటే అఖిల్ తో లేదంటే ఏడవడం తప్ప ఆమె బిగ్ బాస్ హౌస్ లో చేసింది ఏమి లేదు. అఖిల్ నుండి దూరమయ్యాక గత మూడు వారాలుగా కాస్త గేమ్ మీద ఫోకస్ పెట్టింది కానీ.. ఇంతవరకు మోనాల్ ని సూపర్ అన్నోళ్లు లేరు. ప్రతి దానికి ఎమోషనల్ అయ్యి ప్రేక్షకులను ఫూల్స్ చెయ్యడంలో మోనాల్ ది ప్రత్యేకమైన స్థానం. బిగ్ బాస్ లో మోనాల్ ఏడుపు కి ముందు వారాల్లో సింపతీ క్రియేట్ అయినా.. ప్రస్తుతం మోనల్ ఏడుపు చూసిన అందరికి చిరాకు పుడుతుంది.

అసలు బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ ని ఎవరు ఇష్టపడకపోయినా ఆమె గ్లామర్, లవ్ ట్రాక్ ఆమెని కాపాడుతుంది. అసలు ఏ ఐదో వారమో ఎలిమినేట్ అవుతుంది అనుకున్న మోనాల్ 13 వారాలు హౌస్ లో ఉంది అంటే కారణం బిగ్ బాస్ చేసిన హెల్ప్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక తాజాగా బిగ్ బాస్ లో మోనాల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అఖిల్ దూరమైప్పటినుండి ఒంటరిగా ఫీలవుతున్న మోనాల్ కి దొరికిందే సందు ఏడుపు స్టార్ట్ చేస్తుంది. మంగళవారం ఎపిసోడ్ లో మోనాల్ ఎలాంటి ఎక్సప్రెషన్ లేకుండా లాన్ లోని కుర్చీ మీద కూర్చోవాల్సి ఉంటే.. కానీ మోనాల్ ఎక్సప్రెషన్స్ విషయంలో తడబడేసరికి అఖిల్ తన ఎక్సప్రెషన్స్ 10 అని వెయ్యగానే… మోనాల్ ఎక్కి ఎక్కి గుక్కపెట్టి ఏడ్చేసింది. మాములుగా కాదు గుక్కపెట్టి ఏడవడం చూసిన ప్రేక్షకులు బాబోయ్ మోనాల్ ఇక ఆపేయ్ నీ ఏడుపు అంటున్నారు.

Tags:    

Similar News