టాలీవుడ్ లో విషాదం
ప్రముఖ గేయ రచయిత పెద్దాడ మూర్తి మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు
టాలీవుడ్ ను విషాదాలు వీడటం లేదు. వరసగా నటులు, రచయితలు మరణిస్తూ టాలివుడ్ ను శోక సంద్రంలో ముంచుతున్నాయి. తాజాగా ప్రముఖ గేయ రచయిత పెద్దాడ మూర్తి మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జర్నలిస్ట్ గా జీవితాన్ని...
పెద్దాడ మూర్తి జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించి తర్వాత గేయ రచయితగా ఎదిగారు. ఇడియట్, మధుమాసం, అమ్మానాన్న ఒక తమిళమ్మాయి, చందమామ, స్టాలిన్, కౌసల్య సుప్రజ రామ, బలాదూర్ వంటి సిినిమాలకు పెద్దాడ మూర్తి పాటలు రాశారు. ఆయన రాసిన అనేక పాటలు పాపులర్ అయ్యాయి. దాదాపు 200 పైగా పాటలు రాశారు. ఆయన మృతిపట్ల టాలివుడ్ పెద్దలు సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.