బాలీవుడ్ చాలా గ్యాప్ తర్వాత 'ఫన్నే ఖాన్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య రాయ్. ఈ సినిమాలో అనిల్ కపూర్ పాటు రాజ్ కుమార్ రావు ఒక కీలక పాత్రలో నటించాడు. నిన్ననే ఈ సినిమా ప్రేక్షకుల వద్దకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఏమేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం పదండి.
కథ ఇదీ....
తండ్రికి( అనిల్ కపూర్ ) సింగర్ అవ్వాలనే కోరిక ఉంటుంది. కానీ కొన్ని కారణాలు వల్ల అవ్వలేకపోతాడు. సో ఆ కోరిక తన కూతురు లత (పియు సింద్)ద్వారా నెరవేర్చుకోవాలని తాపత్రయపడుతుంటాడు. అందుకు అతని భార్య కవిత(దివ్య దత్తా)కూడా సహకరిస్తుంది. కానీ తన కూతురు లత మాత్రం భారీకాయం వల్ల అవమానాలు పొందుతూ ఉంటున్న సమయంలో ప్రముఖ గాయని బేబీ సింగ్(ఐశ్వర్య రాయ్)ని కిడ్నాప్ చేస్తాడు ప్రశాంత్ వర్మ. అసలు ఎందుకు బేబీ సింగ్ ని కిడ్నప్ చేయాల్సి వచ్చింది..అసలు ఆమెకు ప్రశాంత్ వర్మకి సంబంధం ఏంటన్నది ఈ సినిమా స్టోరీ.
సినిమాకే హైలెట్.....
ఇక ఇందులో నటీనటులు పెర్ఫార్మన్స్ విషయంకి వస్తే...అనిల్ కపూర్ నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి. తండ్రి పాత్రలో ఇతను జీవించాడనే చెప్పాలి. ఇక ఐశ్వర్య రాయ్ గురించి ఎక్కువ ఊహించుకోకపోతే నిరాశ పరచదు. రాజ్ కుమార్ పర్లేదు అనిపించుకున్న...పియు మాత్రం జీవించేసింది. దర్శకుడు అతుల్ మంజ్రేకర్ స్క్రీన్ ప్లే చాలా సింపుల్ గా ఉండటంతో మెయిన్ ప్లాట్ నుంచి డీవియేట్ కాకుండా ఎంగేజ్ అయ్యేలా సాగిపోయింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది పర్లేదు అనిపించుకున్నాడు. తిర్రు సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. ఓవర్ అల్ గా ఈ సినిమా డీసెంట్ ఎంటర్ టైనర్ గా చెప్పుకోవొచ్చు. క్లైమాక్స్ లో డ్రామా కొంచం ఎక్కువ అనిపించినా ఓవరాల్ గా ఈ సినిమాను ఒకసారి చూసేవచ్చు.