నటుడు సుధీర్ బాబు నిర్మాణంలో వచ్చిన తొలి సినిమా 'నన్ను దోచుకుందువటే'. సుధీర్ బాబు, నభ నటేష్ జంటగా నటించిన ఈ సినిమా తొలిరోజు బాగానే ఉందని టాక్ దక్కించుకున్నా వసూళ్లు మాత్రం డల్ గా వచ్చాయి. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా... తర్వాత అయినా పుంజుకుంటుందని చూస్తే శనివారం కూడా వసూళ్లలో ఎటువంటి బెటర్మెంట్ కనిపించలేదు. అలానే ఆదివారం కూడా చాలా వీక్ గా వచ్చాయి కలెక్షన్స్. దీంతో ఈ సినిమాను ఫ్లాప్ గా పరిగణించారు ట్రేడ్ వారు. ఈ సినిమాతో పాటు రెండు మూడు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సినిమాలు ఈ సినిమా కంటే చాలా వీక్ గా ఉన్నాయి.
శైలజారెడ్డి అల్లుడు పరిస్థితి...
ఇక ఈ సినిమాకి ముందు వారం రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. వినాయక చవితి రోజు 'శైలజారెడ్డి అల్లుడు', 'యూ-టర్న్', 'సామి' సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదట 'శైలజారెడ్డి అల్లుడు' గురించి చూసుకుంటే మొదటి వీకెండ్ బాగానే ఉంది అనుకున్నా సెకండ్ వీకెండ్లో కూడా కలక్షన్లు ఇంప్రూవ్ అవలేదు. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యమని తేలిపోయింది. సో కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇది యావరేజ్ అని డిక్లేర్ చేసారు ట్రేడ్.
అన్ని సినిమాలూ...
సామ్ నటించిన 'యూ-టర్న్' మూవీకి ఇంకా వసూళ్లు అయితే వస్తున్నాయి కానీ ఇది కూడా యావరేజ్ మార్కుని దాటలేదని ట్రేడ్ చెబుతోంది. ఇక వీటితో పాటు విక్రమ్ 'సామి' తమిళం, తెలుగులో డిజాస్టర్ గా నిలిచింది. తెలుగులో దీన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు తప్పవు. సో గత కొన్ని వారాల నుండి రిలీజ్ అవుతున్న ఏ సినిమా హిట్ టాక్ ని దక్కించుకోలేదు.