నిన్న రాత్రి హైదరాబాద్ లో నాలుగు భాషలకు గాను ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. సీతాకోక చిలుకల్లాంటి హీరోయిన్స్ అందమైన డ్రెస్ లతో హాట్ హాట్ గా ఈ ఫిలింఫేర్ అవార్డ్స్ కి తరలి వచ్చారు. అతిరథుల మధ్యన బెస్ట్ ఫిలిం, యాక్టర్... ఇలా నాలుగు భాషలకు గాను నటీనటులు ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. అందులో తెలుగులో ఎవరెవరికి ఈ అవార్డ్స్ వచ్చాయో చూసేద్దామా..!.
బెస్ట్ ఫిలిం: బాహుబలి 2: ది కంక్లూషన్
బెస్ట్ డైరెక్టర్: ఎస్ ఎస్ రాజమౌళి- బాహుబలి 2: ది కంక్లూషన్
బెస్ట్ యాక్టర్: విజయ్ దేవరకొండ -(అర్జున్ రెడ్డి)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్ ): వెంకటేష్ - గురు
బెస్ట్ యాక్ట్రెస్: సాయి పల్లవి (ఫిదా)
బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్): రితిక సింగ్ (గురు)
బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్: రానా దగ్గుబాటి - బాహుబలి 2: ది కంక్లూషన్
బెస్ట్ యాక్ట్రెస్ సపోర్టింగ్ రోల్: రమ్య కృష్ణ - బాహుబలి 2: ది కంక్లూషన్
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్; ఎం ఎం కీరవాణి - బాహుబలి 2: ది కంక్లూషన్
బెస్ట్ లిరిక్స్ :ఎం ఎం కీరవాణి - దండాలయ్యా (బాహుబలి 2: ది కంక్లూషన్)
బెస్ట్ ప్లేబాక్ సింగర్: హేమచంద్ర - ఊసుపోదు (ఫిదా)
బెస్ట్ ప్లేబాక్ సింగర్ (ఫిమేల్ ): మధు ప్రియా - వచ్చిందే (ఫిదా)
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: కైకాల సత్యనారాయణ
బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్: కళ్యాణి ప్రియదర్శన్ - హలో
టెక్నికల్ అవార్డ్స్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: సాబు సీరిల్ - బాహుబలి 2: ది కంక్లూషన్
బెస్ట్ సినిమాటోగ్రాఫర్: కె కె సెంథిల్ కుమార్ - బాహుబలి 2: ది కంక్లూషన్
బెస్ట్ కొరియోగ్రఫీ:
శేఖర్ వీ జె - అమ్మడు లెట్స్ కుమ్ముడు ( ఖైదీ నెంబర్.150) & వచ్చిందే (ఫిదా)