ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిర్మాతలకు సినిమాలపై పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది కానీ ఆ పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అయిపోయాయి. సినిమాకు కొంచం పాజిటివ్ టాక్ వస్తే తప్ప ఆ పెట్టుబడి వచ్చే అవకాశాలు లేవు. కానీ ప్రముఖ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ కు మాత్రం ధనలక్ష్మి లండన్ ప్రభుత్వం రూపంలో తలుపు తట్టింది.
లండన్ లో రూ.20 కోట్లతో షూటింగ్
ప్రస్తుతం ప్రసాద్ నిర్మాణం అఖిల్ మూడవ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత కొంత కాలంగా లండన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో కీలక భాగం అక్కడే జరగాల్సి ఉండటంతో భారీ వ్యయంతో అది కొనసాగిస్తున్నారు. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం కేవలం అక్కడి షెడ్యూల్ కె దాదాపు 20 కోట్లు అవుతుందంట. వామ్మో అంతనా అనిపించడం సహజం.
సగం తిరిగి అవ్వనున్న యూకే
కానీ నిర్మాత ప్రసాద్ కి అదృష్టం ఏంటంటే.. తమ దేశంలో షూటింగ్ జరుపుకునే విదేశీ సినిమాలకు అందుకు అయ్యే బడ్జెట్ లో సగం తమ ప్రభుత్వం నుండి రీ ఫండ్ చేసే విధంగా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంటే 20 కోట్లు అవుతుందంటే దాంట్లో సగం అంటే 10 కోట్లు ఆయనకు వెనక్కు వస్తున్నట్టే. ఏది ఏమైనా యూకే ప్రభుత్వం ఇండియన్ సినీ ఇండస్ట్రీకి తీపి కబురు చెప్పింది. అక్కడ షెడ్యూల్ పూర్తయ్యాక హైదరాబాద్ లో జరిగే బ్యాలన్స్ షూటింగ్ పూర్తయిపోతుంది.