తమిళ దర్శకుడు హరి పోలీస్ కథలనే సినిమాలుగా చేసి కొన్ని హిట్స్ కొన్ని ప్లాప్స్ కొట్టాడు. విక్రమ్ తో చేసిన సామి సినిమా పోలీస్ స్టోరీ తోనే తెరకెక్కడం ఆ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ అవడం జరిగింది. తర్వాత సూర్య తో పోలీస్ కథకంటూ సింగం వన్, టు, త్రీ సినిమాలు చేసాడు. ఈ సింగం సీరీస్ లో సింగం వన్ అండ్ టు లు బ్లాక్ బస్టర్ హిట్ అవగా... సింగం త్రీ తేడా కొట్టడంతో.. మళ్ళీ విక్రమ్ హీరోగా దర్శకుడు హరి సామి స్క్వేర్ అంటూ చేయడం అది కాస్తా డిజాస్టర్ అవ్వడం జరిగాయి.
రెండు పోలీస్ కథలూ.....
తాను చేసిన పోలీస్ కథల సినిమాలను మార్చి మార్చి చేయడంతో చివరి రెండు పోలీస్ కథలు తేడా కొట్టాయి. సూర్య కాంబోలో చేసిన సింగం వన్, టు లు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అందుకే ఇప్పుడు సూర్య - హరి కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది. మాములుగా సింగం త్రి హిట్ అయితే మళ్ళీ వీళ్ళ కాంబో సింగం 4 వస్తుందన్నారు. కానీ అది ప్లాప్ అవడంతో సింగం 4 ఆగిపోయింది. ఇక హరి కూడా సామి స్క్వేర్ సినిమాని తాను తీసిన సినిమాలను అన్నికలిపి కొట్టాడు. ఒకప్పుడు పోలీస్ స్టోరీలకు పెట్టింది పేరైన హరి తీసిన సామి స్క్వేర్ చేసాక అయ్యో అన్నారు. అసలు హరి మార్క్ ఎక్కడా ఆ సినిమాలో కనబడలేదు.
సూర్యని కొత్తగా......
ఆ దెబ్బకి ఇక పోలీస్ కథలకు హరి పోలీస్ కథల జోలికి వెళ్లడనుకుంటే ... మళ్ళీ సూర్య తో అదే తరహా పోలీస్ కథతో చేయబోతున్నాడట. ఇక సూర్య తో చేసిన సింగం సీరీస్ లోనే సూర్య ని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఎలా చూపించాలో అలా అంటే అన్ని విధాలుగా చూపించిన హరి ఇప్పుడు సూర్య ని కొత్తగా ఎలా చూపిస్తాడో కానీ... హరి పోలీస్ కథలను వదిలిస్తే బెటర్ అంటూ కామెంట్స్ పడుతున్నాయి. మరి ఇలాంటి నెగిటివిటీలో వీరి కాంబోలో సినిమా అంటే ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోనూ ఏమంత క్రేజుంటుందో అనేది కాస్త అనుమానమే.