ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హెబ్బా పటేల్ పేరు ఎక్కడా వినబడడం లేదు. కుమారి 21 ఎఫ్ లో బోల్డ్ గా నటించిన హెబ్బా పటేల్... రాజ్ తరుణ్ తో జోడికట్టిన సినిమాలన్నీ పర్వాలేదనిపించాయి. అయితే వీరిద్దరి జోడి తో సినిమాలు బాగా ఆడడంతో రాజ్ తరుణ్ కి హెబ్బా కు మధ్య లవ్ ఎఫ్ఫైర్ ఉదని గాసిప్స్ మొదలయ్యాయి. ఇక రెండు మూడు సినిమాల తర్వాత హెబ్బా పటేల్ కి ఇలాంటి ప్రశ్నలు ఎదురవగా.. అబ్బే మా మధ్యన అలాంటిదేం లేదండీ అంటూనే రాజ్ తరుణ్ పక్కన నటించడం బోర్ అనేసింది. ఇక రాజ్ తరుణ్ వేరే హీరోయిన్స్ తో బిజీ అవగా హెబ్బా మాత్రం పెద్దగా అవకాశాలు లేక క్రేజ్ పోయింది.
తాజాగా హెబ్బా పేరు రాజ్ తరుణ్ కొత్త సినిమాలో ఫైనల్ చేస్తున్నట్టుగా వినబడుతుంది. మరోపక్క రాజ్ తరుణ్ కూడా ప్లాప్స్ లో ఉన్నాడు. అతని సినిమాలు వరసగా ఫెయిల్ అవడంతో.. ఇప్పుడు కథల మీద కాన్సన్ట్రీట్ చెయ్యడమే కాదు... తన పక్కన నటించే హీరోయిన్స్ మీద కూడా శ్రద్ద పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం హెబ్బా పటేల్, రాజ్ తరుణ్ జంటగా ఒక సినిమా చేయబోతున్నారనే న్యూస్ వినబడుతున్న వేళ హెబ్బా పటేల్ తాజాగా ఫిలింఫేర్ అవార్డ్స్ లో పిచ్చెక్కించింది. గత శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన 65th జియో ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో హెబ్బా పటేల్ హాటెస్ట్ డ్రెస్సుతో అదరగొట్టింది.
వైట్ కలర్ గౌన్ లో క్లివేజ్ అందాలతో... రెచ్చిపోయింది. ప్రస్తుతం ఫెడవుట్ అయ్యే సమయంలో ఇలా అందాల ఆరబోతకు దిగి మళ్ళీ బిజీ అవుదామని హెబ్బా కలలు కంటుంది. కానీ హెబ్బకి పిలిచి అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలే కరువయ్యారు. మరి నిజంగానే రాజ్ తరుణ్ పక్కన హెబ్బకి మరోమారు ఛాన్స్ వచ్చింది అంటే... తన అందచందాలతో అందరిని మెస్మరైజ్ చేసి మళ్ళీ సెటిల్ అవాలని హెబ్బా అనుకుంటుంది. ఇక ఫిలింఫేర్ అవార్డ్స్ లో హెబ్బా వేసిన డ్రెస్సు తో గ్లామర్ గేట్లు మాములుగా తెరవలేదు. ఎప్పుడూ పొట్టి నిక్కర్లతో... స్లీవ్ లెస్ జాకెట్స్ తో అదరగొట్టే హెబ్బా ఆ వైట్ కలర్ డిజైనర్ డ్రెస్సులో మత్తెక్కిస్తోంది