కలెక్షన్స్ డల్ కానీ... రామ్ హ్యాపీ!

Update: 2018-10-21 04:53 GMT

దసరా కానుకగా రామ్ నటించిన 'హలో గురు ప్రేమ కోసమే' సినిమా రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. 'నేను శైలజ', 'నేను లోకల్' సినిమాలని కలిపి ఈ సినిమా తీశారని డైరెక్టర్ త్రినాధ్ రావు నక్కిన పై నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మొదటి రోజే నుండి ప్లాప్ టాక్ తో రన్ అవుతున్న ఈసినిమాలో హీరోయిన్ గా అనుపమ నటించింది.

కెరీర్ లోనే.....

రామ్.. అనుపమ పెర్ఫార్మన్స్ పర్లేదు అనిపించినా రోజురోజుకు వసూళ్లు తగ్గిపోతున్నాయి. అయితే హీరో రామ్ గాల్లో తేలిపోతున్నాడు.ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. అదేంటి అని ఆశ్చర్య పోతున్నారా? ఈసినిమా ఎలా ఉందో...రామ్ పట్టించుకోకపోయినా అతడి కెరీర్ లోనే ఈసినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకోవడంతో పండగ చేసుకుంటున్నాడు.

టాక్ తో సంబంధం లేకుండా......

అతడి ఆనందానికి కారణం ఇది. ఒక్క రామ్ మాత్రమే ఇలా కాదు చాలా మంది యంగ్ హీరోస్ అంతా ఇప్పుడు ఇలానే బిహేవ్ చేస్తున్నారు. కలెక్షన్స్ ..టాక్ తో సంబంధం లేకుండా కెరీర్ బెస్ట్ వచ్చేపాటికి సంబరపడిపోతున్నారు.

Similar News