యంగ్ హీరో రామ్ పరిస్థితి గత కొన్నేళ్ల నుండి రెండు ఫ్లాపులు..ఒక హిట్ అన్నట్లుగా సాగుతుంది. 'నేను శైలజ' సినిమా తర్వాత రామ్ కు వరసగా రెండు ఫ్లాప్ లు వచ్చాయి. ‘హైపర్’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు మూడో సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారు. రామ్ - అనుపమ కాంబినేషన్ లో త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమా దసరా కానుకగా రేపు విడుదల అవుతుంది. ఈ సినిమాపై జనాలలో అంచనాలు బాగానే ఉన్నాయి. త్రినాధరావు నక్కిన డైరెక్షన్ లో సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను దిల్ రాజు 25 కోట్లకు అమ్మేసినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ కి ఉన్న మార్కెట్ తో పోల్చుకుంటే ఇంత మొత్తం కలెక్ట్ చేయడం చాలా కష్టం అని చెబుతున్నారు ట్రేడ్ వారు. సినిమా సూపర్ హిట్ టాక్ దక్కించుకుంటే తప్ప ఇంత రావడం కష్టం.
హిట్ అయినా అంత వసూల్ చేస్తుందా..?
రామ్ గత సినిమాల విషయాన్ని చూస్తే సక్సెస్ టాక్ ను దక్కించుకున్న చిత్రాలు కూడా ఇంతలా షేర్ ను రాబట్టలేక పోయాయి. మరోపక్క ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత రామ్ మరోసారి అనుపమతో నటించాడు. ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంది కానీ సినిమా ఏమవుతుందో చూడాలి. నిర్మాత దిల్ రాజ్ పరిస్థితి ఈ ఏడాది అంతగా ఏమి లేదు. రామ్, అనుపమ, దిల్ రాజు ముగ్గురు ఫ్లాప్ ల్లోనే ఉన్నారు. మరి వీరి ముగ్గురిని డైరెక్టర్ త్రినాధరావు గట్టెక్కిస్తాడేమో చూడాలి.