టాలీవుడ్ కండల వీరుడు రానా దగ్గుబాటి తన కంటి ఆపరేషన్‌కు రెడీ అవుతున్నాడు. వైవిధ్యంతో సినిమాలు చేస్తూ తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన రానా ప్రస్తుతం ఓ పీరియాడిక్ జానర్ సినిమా చేస్తున్నాడు. అయితే ఎప్పటినుండో తన కుడి కన్నుతో ఇబ్బంది పడుతున్న రానా ఆ కన్నుకి ఆపరేషన్ చేయించుకోడానికి సిద్ధమవుతున్నారు.
విదేశాల్లో చికిత్స...
రానా కుడి కన్నుకు గతంలో ఓ హాస్పిటల్‌లో చికిత్స నిర్వహించారు. అయినా ఉపయోగం లేదు. ఈ మధ్య తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న రానా.. ఈ సారి విదేశాల్లో చికిత్స చేయించుకోనున్నారు. ఈ విషయాన్ని తన తండ్రి సురేష్ బాబు వెల్లడించారు. చికిత్స నిమిత్తం సెట్స్‌పై ఉన్న షూటింగ్‌లకు విరామం ఇచ్చారు. రానా ప్రస్తుతం పీరియాడిక్ జానర్‌లో తెరకెక్కుత్తున్న 1945, హథీ మేరీ సాథీ, రాజా మార్తండ వర్మ చిత్రాల్లో నటిస్తున్నారు. మరి చికిత్స చేయించుకోడానికి ఎన్ని రోజులు పడుతుందో, చేయించుకున్నాకా ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలో తెలియాల్సి ఉంది. అప్పటివరకు 1945 సినిమా షూటింగ్ ఆగక తప్పదు.