కారు గురించి అడిగినోళ్ల తాట తీసింది!!

చాలామంది చిన్న హీరోయిన్స్ అయినా, లేదంటే యాంకర్స్ అయినా, సింగర్స్ అయినా ఖరీదైన కారు కానీ, ఇంటిని కొన్నప్పుడు చాలామంది నెటిజెన్స్ వీళ్ళకి అంత డబ్బు ఎక్కడిది.. [more]

Update: 2020-11-03 06:12 GMT

చాలామంది చిన్న హీరోయిన్స్ అయినా, లేదంటే యాంకర్స్ అయినా, సింగర్స్ అయినా ఖరీదైన కారు కానీ, ఇంటిని కొన్నప్పుడు చాలామంది నెటిజెన్స్ వీళ్ళకి అంత డబ్బు ఎక్కడిది.. ఇంత లగ్జరీ లైఫ్ ఎలా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తారు. అప్పుడెప్పుడో అనసూయ ఆడి కారు కొన్నప్పుడు ఆమెని చాలామంది నెటిజెన్స్ సెటైరికల్ గా మాట్లాడితే అప్పట్లో వాళ్ళకి అనసూయ దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చింది. అయితే తాజాగా మరో నటి ఇలాంటి ప్రశ్నకి నెటిజెన్ కి తాట తీసే సమాధానం ఇచ్చింది. ఆమె బిగ్ బాస్ తో పాపులారిటీ సంపాదించి.. ప్రస్తుతం సీరియల్స్, సినిమాలు, ఓపెనింగ్స్, రిబ్బన్ కటింగ్స్ అంటున్న హిమజ.

బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక బాగా పాపులర్ అయిన హిమజ ప్రస్తుతం చాలా సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. నటి కాకముందు పలు ఉద్యోగాలు చేశాను అని చెబుతున్న హిమజ అప్పట్లో ఇంటి రెంట్ కి, ఫుడ్ కి తన సంపాదన సరిపోయేది కాదని… ఇక నటిగా మారాక తన లైఫ్ టర్న్ అయ్యింది అని అంటుంది. ఇక ఇప్పుడు హిమజ కొన్న బెంజ్ కారు గురించి ఆమెకి చాలా రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. చిన్న నటివి ఇంత పెద్ద కారు ఎక్కడిది అని, దానికి హిమజ నటిని కాబట్టి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద ఈ కారు తనకి ఈఎంఐ లో షోరూం వాళ్ళు ఇచ్చారని.. ప్రతి నెల ఆరో తారీఖున దీనికి ఈఎంఐ కట్ అవుతుంది అని..చెప్పడమే కాదు.. నెటిజెన్ అడిగిన ప్రశ్నకు ఎప్పుడైనా తనకు డబ్బులు ఇబ్బందైతే నీకు ఫోన్ చేస్తా వచ్చి నా ఈఎంఐ కట్టు.. ఎలాగూ కరోనా కారణంగా కొన్ని నెలల నుంచి వర్క్ లేదు.. ఆదాయం లేదు.. నాకు కారు ఎక్కడిది అని అడిగినోడు ఈఎంఐ కడతాడేమో అడుగుతా అంటూ గట్టి కౌంటర్ ఇఛ్చింది

Tags:    

Similar News