రుద్రమదేవిని భారీ హంగులతో సొంతంగా నిర్మించి, డైరెక్ట్ చేసిన దర్శకుడు గుణశేఖర్... ఆ సినిమాతో లాస్ అయ్యాడని చెప్పలేం కానీ భారీ లాభాలు అయితే మూటగట్టుకోలేకపోయాడనేది జగమెరిగిన సత్యం. రుద్రమదేవి వంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత గుణశేఖర్ ఏదైనా లవ్ స్టోరీ చేస్తే బాగుండేది. కానీ మళ్లీ మరో భారీ ప్రాజెక్ట్ కి ఆయన శ్రీకారం చుట్టాడు. అది కూడా సురేష్ ప్రొడక్షన్ లో రానా హీరోగా. హిరణ్యకశిప అనే చరిత్రాత్మక చిత్రాన్ని తలపెట్టిన గుణశేఖర్ ఆ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చుని రెండేళ్లు కావొస్తుంది. ఇక హిరణ్యకశిపగా రానా పేరు మార్మోగిపోయింది. గత కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్న హిరణ్యకశిప... ఈమధ్యన ఎక్కడ వినబడకపోయేసరికి హిరణ్యకశిప ప్రాజెక్ట్ అటకెక్కిందనుకున్నారు.
ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేం
కానీ ఈ నగరానికి ఏమైంది ఇంటర్వూస్ లో భాగంగా నిర్మాత సురేష్ బాబు హిరణ్యకశిప ప్రాజెక్ట్ ఉందని కన్ఫర్మ్ చేశాడు. తాజాగా సురేష్ బాబు మాట్లాడుతూ... గుణశేఖర్ రెడీ చేసిన హిరణ్యకశిప ఆయన దర్శకత్వంలో మా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లోనే ఉంటుందని చెప్పేసాడు. గత రెండేళ్ల నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు గుణశేఖర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కానీ ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పటికి పూర్తవుతయనేది మాత్రం నేను చెప్పలేదు. ఈ ప్రీ ప్రొడక్షన్ పనులను గుణశేఖర్ తో పాటు అప్పుడపుడు రానా కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు.