బిగ్ బాస్ అంటే అంత చీపా?

బిగ్ బాస్ లోకి సెలబ్రిటీస్ తో పాటుగా.. కామన్ పీపుల్ కూడా అడుగుపెడుతూనే ఉంటారు. బాలీవుడ్, కోలీవుడ్ ఇతర భషాల్లో అయితే పేరున్న సెలబ్రిటీస్ బిగ్ బాస్ [more]

Update: 2020-07-29 05:03 GMT

బిగ్ బాస్ లోకి సెలబ్రిటీస్ తో పాటుగా.. కామన్ పీపుల్ కూడా అడుగుపెడుతూనే ఉంటారు. బాలీవుడ్, కోలీవుడ్ ఇతర భషాల్లో అయితే పేరున్న సెలబ్రిటీస్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే.. తెలుగులో కాస్త పేరున్న సెలెబ్రిటీస్ కి బిగ్ బాస్ అంటే పెద్దగా ఇష్టముండదు. అవకాశాలు లేని హీరో, హీరోయిన్స్, అలాగే సింగెర్స్, ఇలా చాలామంది బిగ్ బాస్ తర్వాత కెరీర్ లో బిజీ అవుదామని బిగ్ బాస్ కి వెళ్లాలనుకుంటారు. కొంతమందికి బిగ్ బాస్ తర్వాత కెరీర్ బావుంటే.. కొంతమందికి కెరీర్లో బిగ్ బాస్ ముందు తర్వాత పెద్దగా తేడా ఉండదు. అయితే ఇప్పుడు సీజన్ 4 కి టాలీవుడ్ లో అవకాశాలు లేని హాట్ హీరోయిన్ ఒకరు వెళుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంటే ఆమె నేనా బిగ్ బాస్ కా.. మళ్ళి ఇంకోసారంటే అంటూ వార్నింగ్ ఇచ్చేస్తుంది.

ఆమె ఎవరో కాదు.. మొగుడు లాంటి సినిమాలో అందాలు విచ్చలవిడిగా ఆరబోసినా.. కెరీర్ లో ముందుకెళ్లలేక హాట్ హాట్ ఫోజుల్తో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శ్రద్ద దాస్. శ్రద్ద దాస్ పేరు బిగ్ బాస్ సీజన్ 4 ప్రచరంలోకొచ్చినప్పటినుండి ప్రచారం జరుగుతున్న పేరు. హాట్ హీరోయిన్ శ్రద్ద దాస్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతుంది అని.. అయితే తాను ఈ సీజన్ 4 లో లేనని.. అసలు బిగ్ బాస్ లో పాల్గొనాలనే ఆలోచనే తనకి లేదని.. బిగ్ బాస్ లోకి రమ్మని తననెవరూ సంప్రదించలేదని.. నేను బిగ్ బాస్ సీజన్ 4 లోకి వస్తున్నా అనేది అంతా రూమర్ అని… సోషల్లో మీడియా తనపై జరుగుతున్న ప్రచారాన్ని చూసి చూసి చిరాకొచ్చింది అని.. ఇక సహించలేక హెచ్చరిస్తున్నా అని.. ఇదే ఫస్ట్ లాస్ వార్నింగ్….. ఇలా అసత్యాలు; ప్రచారం చెయ్యొద్దూ అంటూ బిగ్ బాస్ విషయంలో శ్రద్ద దాస్ ఫైర్ అయ్యింది.

Tags:    

Similar News