ఎన్టీఆర్ సినిమాకు అరుదైన ఘనత

Update: 2018-07-21 09:41 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరస హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కి గత ఏడాది దర్శకుడు బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా.. తెరకెక్కిన జై లవ కుశ సినిమా దసరా కానుకగా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో తో లాభాలు మూట గట్టుకున్నాడు. ఈ సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా... అటు ఓవర్సీస్ లోనూ అదరగొట్టే కలెక్షన్స్ వచ్చాయి కూడా. జై, లవ, కుశ గా ఎన్టీఆర్ చించి ఆరేసాడు. జై పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతః అన్నట్టుగా ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నత్తి ఉన్నవాడిగా.. కుర్రోడిగా.. తమ్ముళ్ల మీద పగతో.. చివరికి వారి ప్రేమకు లొంగిపోయి ప్రాణాలొదిలేసే క్యారెక్టర్ లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించి అదుర్స్ అనిపించాడు.

ఏకైక తెలుగు చిత్రం

అయితే మళ్లీ ఇన్నాళ్లకు జై లవ కుశ గురించి ఇంతగా మాట్లాడుకోవడానికి గల కారణం ఏమిటంటే... జై లవ కుశ సినిమా ఇప్పుడు ఒక అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ జై లవకుశ నార్త్ కొరియాలో జరిగే బుచీయోన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండు రోజుల ప్రదర్శనకి ఎంపికై.. ఒక తెలుగు సినిమా గౌరవాన్ని పది రేట్లు పెంచింది. ఎందుకంటే జై లవ కుశ ఈ చిత్రోత్సవంలో చోటు లభించిన ఏకైక తెలుగు చిత్రంగా రికార్డుని సృష్టించింది. ఉత్తమ ఏషియన్ సినిమా విభాగంలో జై లవ కుశ చిత్రానికి ఈ గౌరవం దక్కింది. మరి ప్రేక్షకుల నుండి విశేష స్పందనే కాదు.. కలెక్షన్స్ పరంగానూ అదరగొట్టిన జై లవ కుశ కు ఈ గౌరవం దక్కడం అనేది కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు... ప్రతి ఒక్క తెలుగువాడు ఆనంద పడాల్సిన విషయమే.

Similar News